పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమే: TDP MLC

ABN , First Publish Date - 2022-06-28T19:29:12+05:30 IST

పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమే అని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) అన్నారు.

పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమే: TDP MLC

అమరావతి: పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమే అని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి)  అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించాడని...  దానికి అర్హత, ఆథరైజేషన్ వ్యాలిడిటీ ఏమీ లేవని వ్యాఖ్యానించారు. జగన్ రైతులకు పంటల బీమా ప్రీమియం ఎంత కట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకంతో రైతులు నష్టపోయి, పార్టీ నాయకులు, మద్దతుదారులు లాభపడుతున్నారని తెలిపారు. లేని ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి రైతులను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.


అధికంగా పంటలు వేసిన ప్రాంతానికి పంటల బీమా చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన పంటకు తక్కువ బీమా ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రజాధనాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని తన మద్దతుదారులకు పంటల బీమా రూపంలో దోచిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. గతంలో ఉన్న ధరల స్థిరీకరణ పథకానికి రెక్కలొచ్చాయన్నారు. జగన్ రైతుల పక్షపాతి కాదు.. కక్షపాతి అని విమర్శించారు. అమ్మఒడి పథకానికి లేనిపోని నిబంధనలు పెట్టి అవకతవకలకు పాల్పడుతున్నారని రవీంద్రనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-28T19:29:12+05:30 IST