పొదలకూరులో టీడీపీ నేత అరెస్టుకు యత్నం

ABN , First Publish Date - 2022-01-23T04:09:23+05:30 IST

మండలంలోని నేదురుపల్లి గ్రామంలోనూ, పొదలకూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట శనివారం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మండలాధ్య

పొదలకూరులో టీడీపీ నేత అరెస్టుకు యత్నం
పొదలకూరు స్టేషన్‌ ముందు గుమికూడిన ఇరుపార్టీల వారు

అడ్డుకున్న పార్టీ నాయకులు

 పొదలకూరు స్టేషన్‌ ఎదుట ఉద్రిక్తత

ఎస్‌ఐ వాహనం కింద పడుకుని నిరసన

పొదలకూరు, జనవరి 22 : మండలంలోని నేదురుపల్లి గ్రామంలోనూ, పొదలకూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట శనివారం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణిపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టింగులు చేశారనే నెపంతో  పోలీసులు  కేసు నమోదు చేశారు. మస్తాన్‌బాబును అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. శనివారం మస్తాన్‌బాబు భార్యాపి ల్లలతో కలిసి ఓ ఫంక్షన్‌కు  స్వగ్రామమైన నావూరుపల్లి నుంచి సంగంకు వెళుతుండగా మార్గమధ్యంలోని నేదురుప ల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. తాను భార్యాపిల్లలతో ఫంక్షన్‌కు వెళుతున్నానని, ఫంక్షన్‌ అయ్యాక స్టేషన్‌కు వస్తానని మస్తాన్‌బాబు చెబుతున్నా వినకుండా, ఎస్‌ఐ, పోలీసులు అతన్ని బలవంతంగా పోలీస్‌ వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుం డా స్టేషన్‌కు తరలించడాన్ని నిరసిస్తూ మస్తాన్‌బాబు పోలీస్‌ వాహనానికి అడ్డుగా పడుకున్నాడు. విషయం తెలుసుకున్న నేదురుపల్లి గ్రామస్థులు, మండల టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని పోలీస్‌ చర్యను దుయ్యబట్టారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చేసేదేమీలేక టీడీపీ నాయకులు తామే మస్తాన్‌బాబును స్టేషన్‌కు తీసుకొస్తామ ని హామీ ఇవ్వడంతో పోలీసులు వెనుదిరిగారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ మస్తాన్‌బాబుతోపాటు టీడీపీ వర్గీయులు వందమంది స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన వైసీపీ వర్గీయులు స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి భవనంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు 80 మంది ఒక చోట చేరారు. పొదలకూ రు స్టేషన్‌ ముందు వందల సంఖ్యలో ఇరువర్గాలు మోహరించడంతో గందరగోళం నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు కట్టడి చేశారు. న్యాయవాది సమక్షంలో మస్తాన్‌ బాబును పోలీసులు స్టేషన్‌లోకి తరలించి, విచారించి వదిలేశారు. అయితే వైసీపీ వర్గీయులు మాత్రం స్టేషన్‌ నుంచి పంచాయతీ బస్టాండ్‌ వరకు సోమిరెడ్డికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ వచ్చారు. విషయాన్ని గమనించిన పోలీసులు సైరన్‌ మోగించుకుంటూ పట్టణమంతా తిరగడంతో ఎవరికివారు ఇళ్లకు వెళ్లారు. దీంతో పట్టణంలో ప్రశాంతత నెలకొంది.




Updated Date - 2022-01-23T04:09:23+05:30 IST