కొవిడ్‌ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

Jun 17 2021 @ 00:53AM
కంభం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ నాయకుల నిరసనలు

సమస్యలు పరిష్కరించాలని 

తహసీల్దార్లకు వినతులు  

గిద్దలూరు, జూన్‌ 16 : కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకో వాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశా రు.  బుధవారం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్‌లకు వినతిపత్రాలు స మర్పించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపులో భాగంగా టీడీపీ ఇన్‌చార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు నాయ కులు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు చేపట్టారు.  అన్ని మండలాల్లో టీడీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిం చారు. గిద్దలూరు మండలంలో తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం అందచేశారు. చంద్రన్న బీమా కొనసాగి ఉంటే కొవిడ్‌తో మృతి చెందిన ప్రతి కు టుంబానికి రూ.10లక్షల పరిహారం వచ్చి ఉండేదని, ఇప్పటికైనా ప్రభు త్వం కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల పరి హారం అందజేయాలని  టీడీపీ పట్టణాధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌ డిమాండ్‌ చేశారు. ఆక్సిజన్‌ కొరతతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని, కొవిడ్‌తో  ఉపాధి కరువైన పేద, మధ్యతరగతి, ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరువ్యాపారులకు రూ.10వేల  సాయం అందించాలని కోరారు.  అంత్యక్రియలకు రూ.15వేల సాయాన్ని ప్రభుత్వం ప్రకటించినా ఎక్కడా అమలు కావడంలేదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌,  టీడీపీ నాయకులు పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, సయ్యద్‌ వలి, రజనీబాబు, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌, దస్తగిరి, సాయినాథ్‌, రాఘవేంద్ర పాల్గొన్నారు.

కంభంలో..

కంభం : మండలంలో కరోనా బాధితులను, పేదలను, జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ కంభం మండల టీడీపీ నాయకులు తహసీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అందచేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు కేతం శ్రీనివాసులు ఆధ్వర్యంలో మొదట కందులాపురం సెంటర్‌లో వివిధ సమస్యలపై ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేతం శ్రీనివాసులు మాట్లాడుతూ  ప్రభుత్వ వైఫల్యం వలన ఆక్సిజన్‌ అందక మరణించిన కుటుంబాలను ఆదుకోవాలన్నారు.  అన్నా క్యాంటీన్లను తెరచి పేదలకు ఆహారం అందించాలని 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అం దచేశారు. కార్యక్రమంలో తోట శ్రీను, రమణ, తోట శ్రీను, పాపిరెడ్డి, మాధ వ, ప్రసాద్‌, బుజ్జి, రవికుమార్‌, మాజీసర్పంచ్‌ కోటయ్య పాల్గొన్నారు.

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం : కొవిడ్‌ భారినపడి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుతూ టీడీపీ  నాయకులు తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌ఐ విజయభాస్కర్‌ కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు.  కార్యక్రమంలో పట్టణ అధ్య క్షుడు ఎం.రామిరెడ్డి, ఐటీడీపీ కోఆర్డినేటర్‌ పి.వెంకటరావు, జడ్పీటీసీ అభ్యర్థి పి.శ్రీను, బి.ఆంజనేయులు, డి.బాజీ, బి.నాగరాజు పాల్గొన్నారు.

పెద్దదోర్నాలలో..

పెద్ద దోర్నాల : కరోనా బాధితులను ఆదుకోవాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు అంబటి వీ రా రెడ్డి అధ్యక్షతన బుధవారం తహసీల్దారు కార్యాలయం వరకుర్యాలీ ని ర్వ హించారు. కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బట్టు సు దాకర్‌ రెడ్డి, కాశయ్య,  మల్లయ్య, వెంకటేశ్వరరెడ్డి,  నాయుడు పాల్గొన్నారు. 

పొదిలిలో..

పొదిలి:  కొవిడ్‌తో మృతి చెంది నిరాశ్రయులైన కుటుంబాలను ఆదుకో వాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద ప్ల కార్డులతో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు షేక్‌ రసూల్‌, డాక్టర్‌  ఇమాంసా, షేక్‌గౌస్‌,  టీడీపీ మండల అధ్యక్షుడు  ఓబుల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లాఖుద్దూస్‌, నియోకవర్గ ఎ స్‌ఎ్‌సఎల్‌ నాయకులు అనీల్‌, (పండు), మండల నాయకులు జ్యోతి మల్లికార్జున, ఎస్‌ఎం.బాషా, మౌలాలి, సురేష్‌, నర్సింహారావు, వెంకటేశ్వర్లు, బుచ్చిబాబు, మునిశ్రీనువాసులు పాల్గొన్నారు.Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.