LIVE: రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు నిరసన దీక్ష

ABN , First Publish Date - 2021-10-22T13:10:54+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ముప్ఫై ఆరు గంటల నిరసన దీక్ష గురువారం ఉదయం జన సందోహం నడుమ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై

LIVE: రెండో రోజు కొనసాగుతున్న చంద్రబాబు నిరసన దీక్ష

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష గురువారం ఉదయం జన సందోహం నడుమ ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో ఆయన ఈ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. రెండోరోజు గురువారం కూడా నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. 36 గంటలుగా నిరసన దీక్ష కొనసాగుతుంది. అర్థరాత్రి వరకూ ఎన్టీఆర్‌ భవన్‌కు కార్యకర్తల తాకిడి కొనసాగింది. రాత్రి 10:30 తర్వాత దీక్షా స్థలిపైనే చంద్రబాబు నిద్రించారు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన చంద్రబాబు దీక్షను కొనసాగిస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. మరికాసేపట్లో చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - 2021-10-22T13:10:54+05:30 IST