కౌలు రైతులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T05:39:16+05:30 IST

ఏలేశ్వరం, జూలై 23: గత 40 ఏళ్ల నుంచి దేవాలయ భూముల సాగులో ఉన్న దళిత, పేద కౌలు రైతులకు న్యాయం చేయాలని టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా డిమాండ్‌ చేశారు. మండలంలోని లింగంపర్తిలో ఇటీవల 3 దేవస్థానాల భూముల హెచ్చు కౌలు వేలం

కౌలు రైతులకు న్యాయం చేయాలి
ఏలేశ్వరంలో కౌలు రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతున్న వరుపుల రాజా

టీడీపీ ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ వరుపుల 

ఏలేశ్వరం, జూలై 23: గత 40 ఏళ్ల నుంచి దేవాలయ భూముల సాగులో ఉన్న దళిత, పేద కౌలు రైతులకు న్యాయం చేయాలని టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా డిమాండ్‌ చేశారు. మండలంలోని లింగంపర్తిలో ఇటీవల 3 దేవస్థానాల భూముల హెచ్చు కౌలు వేలం పాటలను రద్దు చేయాలంటూ సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు నాయకత్వంలో కౌలు రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం తొమ్మిదోరోజుకు చేరుకున్నాయి. ఏలేశ్వరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్షా శిబిరాన్ని జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పైల సుభా్‌ష చంద్రబోస్‌, టీడీపీ మండలాధ్యక్షుడు సూతి బూరయ్య, పార్టీ శ్రేణులతో కలసి రాజా సందర్శించారు. కౌలు రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపి వారితో సమస్యలపై చర్చించారు. రాజా మాట్లాడుతూ కొందరు నాయకులు దళారుల చేత హెచ్చు వేలం పాట పాడించి సాగులో ఉన్న పేదలను తరిమేయాలని చూస్తున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు కుట్రలతో వారి నోట్లో మట్టికొట్టే విధానాలకు పాల్పడితే తాము సహించబోమన్నారు. కౌలు రైతులకు న్యాయం చేసేంతవరకూ టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఈనెల 31న మరోసారి నిర్వహించే వేలం పాటలను రద్దు చేసి పాత కౌలుదారులైన దళితులు, పేదలకు తిరిగి భూమిని కేటాయించాలని, లేని పక్షంలో పాటలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. పసల సూరిబాబు, కర్రి సుబ్బారావు, జిగటాపు సూరిబాబు, సతివాడ రాజేశ్వరావు, మైరాల కనకారావు, నూకతాటి ఈశ్వరుడు, శిడగం కన్నారావు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-24T05:39:16+05:30 IST