స్నేహితుల మధ్య ఎందుకు బెడిసికొట్టింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-07-16T02:38:47+05:30 IST

నదీ జలాల వివాదం పై టీడీపీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు

స్నేహితుల మధ్య ఎందుకు బెడిసికొట్టింది: చంద్రబాబు

అమరావతి: నదీ జలాల వివాదం పై టీడీపీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలను భిన్నధృవాలు పాలించినప్పుడు తలెత్తని నీటి వివాదం, ఇప్పుడు స్నేహితుల మధ్య ఎందుకు బెడిసికొట్టిందని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా జలాల వినియోగంపై కుదిరిన ఒప్పందం ఎలాంటి వివాదం లేకుండా అమలైందని చంద్రబాబు పేర్కొన్నారు. జల వివాదాన్ని కలిసి పరిష్కరించుకోలేని పరిస్థితులు ఇద్దరు సీఎంల మధ్య ఉంటే అపెక్స్ కౌన్సిల్ ఎందుకు కోరట్లేదన్నారు.


పోలవరం నిర్వాసితుల పట్ల వైసీపీ నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు మళ్లీ అడవుల పాలయ్యే దుస్థితి ఉందన్నారు. ముగింపు దశకొచ్చిన పోలవరంను బ్యారేజీగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. పెట్రోల్ ధరల పెంపు, రహదారుల దుస్థితిపై త్వరలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాలని నాయకులకు ఆయన సూచించారు.  అప్పులు, ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-16T02:38:47+05:30 IST