రైతుల కోసం నిరంతర పోరాటం

ABN , First Publish Date - 2022-06-29T05:52:43+05:30 IST

రైతుల కోసం టీడీపీ నిరంతర పోరాటం చేస్తుందని ఆ పార్టీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఉద్ఘాటించారు.

రైతుల కోసం నిరంతర పోరాటం

కేసులు, అరెస్టులకు భయపడం: బీకే

ఉద్రిక్త పరిస్థితుల మధ్య గోరంట్లలో ధర్నా 

గోరంట్ల, జూన 28: రైతుల కోసం టీడీపీ నిరంతర పోరాటం చేస్తుందని ఆ పార్టీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఉద్ఘాటించారు. పంటల బీమా రాని రైతుల కోసం మంగళవారం మండల కేంద్రంలో టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంగళవారం సాగింది. బీకే పార్థసారథి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన రహదారిపై పార్టీ జెండాలతో రైతు సాగుచేసిన ప్రతిపంటకు బీమా ఇవ్వాలంటూ ప్రదర్శన చేపట్టార. మండల కాంప్లెక్స్‌ వరకు ర్యాలీగా వెళ్తూ మార్కెట్‌యార్డ్‌ వద్ద ఉన్నఫళంగా మనసు మార్చుకుని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హిందూపురం ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఏఎ్‌సఐ మద్దిలేటి అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వ్యవసాయాధికారులు వచ్చి రోడ్డుపైనే సమాధానం చెప్పాలని బీకే భీష్మించారు. పుట్టపర్తిలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ప్లీనరీకి బైక్‌ ర్యాలీగా వెళ్లడానికి గోరంట్ల వైసీపీ నాయకులు అదే సమయంలో సిద్ధమవుతున్నారు. కదిరి రోడ్డులోని పెట్రోల్‌ బంకు వద్ద ర్యాలీకి రంగం సిద్ధం చేస్తున్నారు. వారు ఇదే మార్గంలో ధర్నాను దాటుకునే వెళ్లాల్సి ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సీఐ సుబ్బరాయుడు అక్కడకు చేరుకుని బీకేతో చర్చించారు. వ్యవసాయ కార్యాలయానికి వెళ్దామని సీఐ సూచించారు. అందుకు బీకే ససేమిరా అన్నారు. ఏఓ మహబూబ్‌ బాషాను ధర్నా వద్దకు పిలిపించి, పంటల బీమా పంపిణీలో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని ఏఓ సమాధానం ఇవ్వడంతో వారు శాంతించారు. ఏఓకు వినతిపత్రం అందించి, టీడీపీ ఆందోళన విరమించింది. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ సోమశేఖర్‌, నాయకులు కొత్తపల్లి నరసింహప్ప, అశ్వత్థరెడ్డి, బెల్లాలచెరువు చంద్ర, నీలకంఠారెడ్డి, గిరిధర్‌గౌడ్‌, ఉత్తంరెడ్డి, రెడ్డప్ప, సుబ్బరాయుడు, వేణు, జయరాం, నరేష్‌, ఉమర్‌ఖాన, వెంకటరంగారెడ్డి, బాలకృష్ణ, వెంకటరెడ్డి, మనోహర్‌, మూర్తి, ఉమాశంకర్‌, కాలనీ శ్రీనివాసులు, అమ్మీబాయి, రవి, నాగభూషణ, నరేంద్ర రాయల్‌, గంగిరెడ్డి పాల్గొన్నారు.


రైతులను నట్టేట ముంచిన జగన

మాజీ మంత్రి పల్లె ధ్వజం

నల్లమాడ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా

నల్లమాడ, జూన 28: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.. రైతులను నట్టేట ముంచారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. పంటల బీమాలో రైతులకు ప్రభుత్వం దగా చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి పల్లె హాజరయ్యారు. మొదట బీసీ వసతి గృహంనుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పల్లె మాట్లాడుతూ పంట సాగుచేసిన ప్రతి రైతుకు బీమా అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేకూరే వరకు పోరాటాలు చేస్తామన్నారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌కు అందించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో కన్వీనర్‌ మైలే శివశంకర్‌, మాజీ కన్వీనర్‌ కేశవరెడ్డి, నాయకులు సలాంఖాన, బుట్టి నాగభూషణంనాయుడు, రమణారెడ్డి, రాజారెడ్డి, గుడ్ర శివారెడ్డి, వెంకటరమణనాయుడు, పల్లపు జయచంద్రమోహన, మాజీ సర్పంచ చెండ్రాయిడు, గంగులప్పనాయుడు, సర్పంచ ప్రభాకర్‌రెడ్డి, మైలే రామచంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:52:43+05:30 IST