దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా!

ABN , First Publish Date - 2021-01-22T05:18:14+05:30 IST

దుర్మార్గపు ప్రభు త్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామి కమని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా!
నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు

 గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 21:  దుర్మార్గపు ప్రభు త్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామి కమని టీడీపీ నేతలు పేర్కొన్నారు.  టీడీపీ సీనియర్‌ నాయకుడు, పొ లిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకట్రావుని అక్రమ అరెస్టును నిరసిస్తూ  ఆపార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కాంప్లెక్స్‌ వద్ద గురు వారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, దేవుడే శిక్షిస్తాడని అన్నారు. ఒంగోలు పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ మా ట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా రామతీర్ధం వచ్చి వివా దం సృష్టించిన విజయసాయి రెడ్డిని అరెస్టు చేయని పోలీసులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే టీడీపీ నాయకులపై అక్ర మ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఏఎంసీ మాజీ చైౖర్మన్‌ కామే పల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పిచ్చోడి చేతిలో రాయిగా రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోందన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు కొఠారి నాగే శ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీ నాయకులను అణిచివేతే లక్ష్యంగా ప్రభుత్వం వ్యహరిస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో తెలుగు రైతు ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి బలగాని వెంకట నారాయణ, బీరం అరుణ రెడ్డి, దాయనేని ధర్మ, ఆర్ల వెంకటరత్నం, ఎల్లీ భవానీ, గంగవరపు పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంతనూతలపాడు: టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు  అక్రమ అరెస్టు గర్హనీయమని ఆపార్టీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు తన్నీరు శ్రీను, చెరుకూరి శ్రీను, వివరం గోవిందయ్య తదితరులుపాల్గొన్నారు.

హైకోర్టు తీర్పు చెంపపెట్టు 

మద్దిపాడు, జనవరి 21: హైకోర్టు తీర్పు ప్రభుత్వాని చెంపపెట్టు అని టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ చేశారంటూ దుష్ప్రచారం చేశారన్నారు. టీడీపీ సీనియర్‌ నేత కిమిడి కళా వెంకట్రావును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు రెప్పవరపు ప్రభాకర్‌, దేవబత్తిన ప్రసాదు, చింతల శ్రీనివాసరావు,  చుంచు హరిబాబు, ముత్తనపల్లి రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు. 

చీమకుర్తి: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కళా వెంక ట్రావు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ గురువారం ఆ పార్టీ నాయకులు చిమకుర్తిలో నిరసన ప్రదర్శన జరిపారు. ఎన్‌టీఆర్‌, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, రూరల్‌ అధ్యక్షుడు గొ ట్టిపాటి రాఘవరావు, మన్నం ప్రసాద్‌, అవిశినేని వెంగన్న, ఉన్నం సుబ్బారావు, కందిమళ్ల గంగారావు, వేల్పుల శ్రీనివాసరావు, అవనిగడ్డ శేషారావు, లక్ష్మీనరసయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:18:14+05:30 IST