చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2021-09-19T05:43:10+05:30 IST

జెడ్‌ కేటగిరి భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులు దాడి చేయడం అమానుషమని తెలుగు యువత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడిని నిరసిస్తూ శనివారం నగరంలోని నర్తకీ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జోగి రమేష్‌ ఫ్లెక్సీని తగులబెట్టారు.

చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషం
ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఫ్లెక్సీని తగుల బెడుతున్న తెలుగు యువత నాయకులు

జోగి రమేష్‌ ఎమ్మెల్యేనా.. వీధిరౌడీనా

తెలుగు యువత నిరసన

నెల్లూరు(వ్యవసాయం), సెప్టెంబరు 18 : జెడ్‌ కేటగిరి భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులు దాడి చేయడం అమానుషమని తెలుగు యువత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడిని నిరసిస్తూ శనివారం నగరంలోని నర్తకీ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జోగి రమేష్‌ ఫ్లెక్సీని తగులబెట్టారు.  చంద్రబాబు ఇంటిపైకి వెళ్తానని ఎమ్మెల్యే జోగి రమేష్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. దాదాపు 300 మంది అనుచరులతో జోగి రమేష్‌ దాడి చేశారని, ఆయన ఎమ్మెల్యేనా లేక వీధిరౌడీనా అని మండిపడ్డారు. తమ నాయకుడు తమకు నేర్పిన సంస్కారం వల్లే సంయమనంతో ఉన్నామని, లేదంటే తగిన రీతిలో జవాబిచ్చేవాళ్లమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రూరల్‌ అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర, తెలుగు యువత సిటీ అధ్యక్షులు తంబి సుజన్‌కుమార్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నగర ప్రధాన కార్యదర్శి సుకేశ్‌వర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:43:10+05:30 IST