చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2020-12-01T15:18:48+05:30 IST

ఇప్పటికే నిర్మించిన టిడ్కో, హుద్ హుద్ ఇళ్లను లబ్జిదారులకు కేటాయించకపోవడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ నిరసన

అమరావతి: ఇప్పటికే నిర్మించిన టిడ్కో, హుద్ హుద్ ఇళ్లను లబ్జిదారులకు కేటాయించకపోవడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ చేపట్టారు.భూసేకరణ పేరుతో అవినీతికి పాల్పడిన అంశంపై సభలో చర్చించాలని నేతల డిమాండ్ చేస్తున్నారు.


తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...20లక్షల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం చేపట్టిందని...వీటిల్లో 90శాతం టిడ్కో ఇళ్ళు పూర్తయ్యాయని తెలిపారు. ఏడాదిన్నరగా పేదలకు వాటిని స్వాధీనం చేయలేదని మండిపడ్డారు. దీంతో ప్రతినెలా అద్దె భారం మోపారన్నారు. నా ఇల్లు నా సొంతం కార్యక్రమంతోనే ప్రభుత్వంలో స్పందన వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇళ్లకు సంబంధించి పాత బకాయిలన్నీ చెల్లించి లబ్ధిదారులకు వాటిని అందచేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు వెళ్లి చంద్రబాబు ఇళ్ళు కావాలా జగన్ ఇళ్ళు కావాలా అని అడగటం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు క్యాటగిరీల్లో నిర్మించిన ఇళ్ళు ఉచితమేనని ప్రతిపక్షంలో ఉండగా జగన్ హామీ ఇచ్చారని... ఇప్పుడు మాట మార్చటం తగదన్నారు. పేదలందరికీ ఇళ్లను ఉచితంగానే ఇవ్వాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-01T15:18:48+05:30 IST