రాష్ట్రంలో ఆటవిక పాలన

ABN , First Publish Date - 2021-03-02T05:44:36+05:30 IST

రాష్ట్రంలో ఆటవికపాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, టీడీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ విమర్శించారు. చిత్తూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం స్థానిక నాలుగురోడ్ల కూడలి వద్ద టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి.

రాష్ట్రంలో ఆటవిక పాలన
పాతపట్నం : గాంధీ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణుల నిరసన

చంద్రబాబును అడ్డుకోవడంపై జిల్లాలో టీడీపీ నిరసన

ప్రభుత్వ తీరుపై మండిపాటు

రాజాం రూరల్‌, మార్చి 1 : రాష్ట్రంలో ఆటవికపాలన కొనసాగుతోందని మాజీ మంత్రి,  టీడీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌  విమర్శించారు.  చిత్తూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం స్థానిక నాలుగురోడ్ల కూడలి వద్ద  టీడీపీ  శ్రేణులు ధర్నాకు దిగాయి.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..  జగన్మోహన్‌రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత అరాచకాలు పెచ్చుమీరాయని ఆరోపించారు.  మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యట నను ఎయిర్‌పోర్టులోనే పొలీసుల ద్వారా అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కలుగజేసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురవాన నారాయణరావు, జి.టి.నా యుడు, గోపి, అప్పలనాయుడు, వంగా వెంకటరావు, టంకాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


అడ్డుకోవడం సరికాదు...

పాలకొండ (వీరఘట్టం) : చంద్రబాబు నాయు డు తిరుపతి పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రానీయకుండా అడ్డుకోవడం సరికాదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం  వీరఘట్టంలో పార్టీ శ్రేణులతో నిరసన తెలిపి, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో  వైసీపీ రాక్షస పాలన సాగి స్తోందని ఆరోపించారు. మునిసిపల్‌ ఎన్నికల నేపఽథ్యం లో ఇటువంటి చర్యలకు దిగడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. భవిష్యత్‌లో వైసీపీ నాయకులు మూల్యం చెల్లించకతప్పదని పేర్కొన్నారు. ఆయనతో పాటు జామి లక్ష్మీనారాయణ ఉన్నారు.


పాతపట్నంలో...

పాతపట్నం : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పోకడలకు పోతోందని టీడీపీ రాష ్ట్రకార్యదర్శి కలమట సాగర్‌ అన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్ర బాబును పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో సోమవారం స్థానిక కోర్టు కూడలిలోని మహాత్మా గాంధీవిగ్రహం ఎదుట టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. కార్యక్రమంలో  పార్టీ మండల అధ్యక్షుడు పైల లక్ష్మయ్య, పైల బాబ్జీ, దువ్వారి ఉదయ్‌భాస్కర్‌, అక్కంద్ర సన్యాసి రావు, కనకల నారాయణ, ఇప్పిలి సింహాచలం, వేణు మాధవ్‌ పొల్లాయ్‌, నల్లి లక్ష్మణ్‌, రాము, కె.రమేష్‌, సతీష్‌, అశోక్‌, తిరుపతి, నవీన్‌ వెంకటరావు, తోట ఫల్గుణరావు, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. 


శ్రీకాకుళంలో...

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, మార్చి 1 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న ఘటనను నిరసిస్తూ  శ్రీకాకుళంలో సోమవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన పార్టీనేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్ల కార్డులు పట్టుకుని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి, ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం దారుణమని, ఈ ఘటనతో టీడీపీ అంటే వైసీపీకి భయం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుందన్నారు. ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు ఎం.వెంకటేష్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:44:36+05:30 IST