
ప్రకాశం (Prakasam) జిల్లా: APలో ఆర్టీసీ చార్జీలు (RTC charges) పెంపుపై తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు, కార్యకర్తలు కనిగిరిలో వినూత్న నిరసన (Innovative protest) తెలిపారు. పట్టణంలో ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ (Rally) చేశారు. అన్ని డిపోలో బస్సులు శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) బస్సు చార్జీలు పెంచినప్పటి నుంచి టీడీపీ నేతలు రోజుకొక జిల్లాల్లో నిరసన తెలుపుతున్నారు.
శనివారం గన్నవరం నియోజవర్గంలోని పలు మండలాల్లో ఆర్టీసీ చార్జీలపై బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. పాలన చేతకాకనే రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఛార్జీలను పెంచుతున్నారని విమర్శించారు. అడుగడునా బాదుడే-బాదుడు అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఇవి కూడా చదవండి