‘టీడీపీకి సపోర్టు చేసినందుకు దాడి’

ABN , First Publish Date - 2021-03-01T06:26:31+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా పనిచేసినందుకు తనపై అకారణంగా నలుగురు దాడిచేశారని స్థానిక రామయ్యవీధికి చెందిన సిద్ధంశెట్టి శివాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

‘టీడీపీకి సపోర్టు చేసినందుకు దాడి’

కొత్తపేట, ఫిబ్రవరి 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా పనిచేసినందుకు తనపై అకారణంగా నలుగురు దాడిచేశారని స్థానిక రామయ్యవీధికి చెందిన సిద్ధంశెట్టి శివాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి మోటారుసైకిల్‌పై తిరిగి వస్తుండగా పప్పుల వీరవెంకటసత్యనారాయణకు చెందిన అనుచరులు గూడపాటి వినయ్‌కుమార్‌, మరో వ్యక్తి  మోటారుసైకిల్‌తో తనను ఢీకొట్టగా కిందపడిపోయానని, వారితో పాటు వేరే మోటారుసైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు దాడిచేసి గాయపర్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ తెలిపారు.

Updated Date - 2021-03-01T06:26:31+05:30 IST