కళా అరెస్టుపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-01-22T05:29:52+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావును అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొబ్బలి చిరంజీవులు అన్నారు. గురువారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో కళా అరెస్టును నిరసిస్తూ చిరంజీవులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

కళా అరెస్టుపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు
సాలూరు రూరల్‌ : జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న భంజ్‌దేవ్‌, టీడీపీ శ్రేణులు

టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అరెస్టును నిరసిస్తూ గురువారం జిల్లా అంతటా పార్టీ నాయకులు నిరసనలు చేపట్టి... ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కేంద్రంతోపాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల తదితర ప్రాంతాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు.

పార్వతీపురంటౌన్‌ : మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కళా వెంకటరావును అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొబ్బలి చిరంజీవులు అన్నారు. గురువారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో కళా అరెస్టును నిరసిస్తూ చిరంజీవులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నెలిమర్ల మండలం రామతీర్థంలోని గొడవలకు కళా వెంకటరావుని బాధ్యుడ్ని చేయడం అన్యాయమన్నారు. 

కళాను కలిసిన చిరంజీవులు

పార్వతీపురం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావును పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం కలిశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో కళాను కలిసి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని, అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని చిరంజీవులు ఫోన్‌లో విలేకరులకు తెలిపారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కళాను కలిసిన వారిలో అరకు పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు దేవకోటి వెంకటినాయుడు, పార్టీ సీనియర్‌ నాయకులు బార్నాల సీతారాం, బడే గౌరునాయుడు, జాగాన రవిశంకర్‌ తదితరులు ఉన్నారు.

 సాలూరులో రాస్తారోకో 

సాలూరు రూరల్‌ : దేవాలయదాడులపై ప్రశ్నిస్తే తమ నేతలను అరెస్టు చేయడంపై సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్పీ భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంత రం తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి ప్రభుత్వ తీరుపై విన్నవించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నిమ్మాది తిరుపతిరావు, చోడవరపు గోవిందరావు, పిన్నింటి ప్రసాదరావు, ఆముదాల పరమేశు, పప్ప ల మెహనరావు, గొర్లె మాధవరావు, విక్రం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

అరెస్టులు అన్యాయం : మాజీ ఎమ్మెల్యే పతివాడ 

పూసపాటిరేగ : తెలుగుదేశం పార్టీ నాయకులు కళా వెంకటరావును అరెస్టు ను మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. గురువా రం చల్లవానితోటలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. తీవ్రవాదుల్లాగా టీడీపీ నాయకుల్ని రాత్రిపూట అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని  ప్రశ్నించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని పట్టుకోకుండా... కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఇటువంటి చర్యకు పాల్పడుతున్నదని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూ రితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ నాయకులు మహంతి శంకరరావు, ఇజ్జురోతు ఈశ్వరరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తారక రామానా యుడు, పతివాడ అప్పలనాయుడు, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-22T05:29:52+05:30 IST