టీడీపీ బలోపేతానికి పాటుపడాలి

ABN , First Publish Date - 2022-08-15T06:16:19+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం గిద్దలూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి పాటుపడాలి
ఆజాదీకా అమృత మహోత్సవ్‌ ర్యాలీలో ఎమ్మెల్యే రాంబాబు

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 14 : ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆదివారం గిద్దలూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది. 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు జాతీయ జెండాను పట్టుకుని స్వాత్రంత్య సమరయోధులను స్మరిస్తూ విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో కొనసాగారు. ర్యాలీ గాంధీబొమ్మ  కూడలి నుంచి కుమ్మరాంకట్ట, రైల్వేస్టేషన్‌రోడ్డు, రాచర్లగేటు కూడలి వరకు కొనసాగింది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలితంగా మనకు స్వాతంత్య్రం లభించిందన్నారు. వారి అడుగుజాడలే మనందరికీ ఆదర్శమన్నారు. ఆగస్టు 15న హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌, ఎంపీపీ కడప లక్ష్మీదేవి, మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. 

నేతాజీ షటిల్‌ కోర్టులో

పట్టణంలోని నేతాజీ షటిల్‌ కోర్టులో ఆదివారం జాతీయజెండాను మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ ఆర్‌.డి.రామక్రిష్ణ ఎగురవేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ గడ్డం భాస్కర్‌రెడ్డి, షటిల్‌ కోర్టు సభ్యులు పాల్గొన్నారు.

మార్కాపురం : ఎన్నో పోరాటాల ఫలం దేశానికి స్వాతంత్య్రమని ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా ఆదివారం డివిజన్‌ లోని రెవెన్యూ సిబ్బంది పట్టణంలోని ప్రధాన వీధులలో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనను ప్రారంభించిన ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్రం కోసం అమరుల త్యాగాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో డీఏవో ఉమారాణి, డివిజన్‌లోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

పొదిలి రూరల్‌ : ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యం లో ఆదివారం బస్టాండ్‌ నుంచి ఆంజనేయ స్వామి గుడి, విశ్వనాథపురం ప్రాంతాల్లో జాతీయ జెండాను చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేశంకోసం ప్రాణాలర్పించిన నాయకులను  గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా సోమవారం  అందరి ఇళ్లపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టీసీ సిబ్బంది, యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : మండలంలోని తుమ్మలబైలు గిరిజన గ్రామంలో ఆదివారం  తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు సురవరం గండి వీరారెడ్డి అధ్యక్షతన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా గూడెంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో త్రివర్ణ పతాకాలను చేతపట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం బీజేపీ సమన్వయకర్త ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎనుముల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపేందుకు ‘హర్‌ ఘర్‌కా తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం స్వాతంత్య్ర సమర యోధులు కుడుముల పెదబయన్న, హనుమంతప్పల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులలు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు సింగాప్రసాద్‌, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర నాయక్‌, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌, అల్లూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఎర్రగొండపాలెం : ముస్లీం మైనార్టీ  యువకులు, మదరస ఎ ఉమిఫ్‌తాహుల్‌ ఉలూమ విద్యార్ధులు ఆదివారం ఎర్రగొండపాలెం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ  నిర్వహించారు. భారతదేశం ఔన్నత్యంకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముస్లింమైనార్టీ పెద్దలు అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను నేటితరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆగస్టు 15 వ తేదీ ప్రతి ఇంటిపైన త్రివర్ణపతాకం రెపరెపలాడాలని అన్నారు. పట్టణంలో ప్రధానవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని మసీదుల ఇమామ్‌లు, ముస్లీం ప్రజాప్రతినిధులు, మదరస విద్యార్ధులు, ముస్లిం యువకులు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : స్థానిక జడ్పీ  బాలుర ఉన్నత పాఠశాలలో అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా సద్గురు సాయిబాబా వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధ్యాయులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. చదువు నేర్పించడంతోపాటు కళలు నేర్పించడంలో కూడా ఉపాధ్యాయులు ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌గా, వద్దుల వీరారెడ్డి జ్యోతిభాపూలేగా, కె.వేణుగోపాల్‌ అల్లూరి సీతారామరాజుగా, చాంద్‌భాష సుభాష్‌  చంద్రబోస్‌గా, టీపీ వెంకటేశ్వర్లు అంబేడ్కర్‌గా, రజినీకుమార్‌ అశోకుడిగా, జీపీ.రామయ్య సుయోధనుడు పాత్రలలో అలరించారు. కార్యక్రమంలో హరిహరరావు, సుధాశ్రీ, శ్రీరాములు, దండా వెంకటరెడ్డి పాల్గొన్నారు.

రాచర్లలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌

రాచర్ల : మండలంలోని రాచర్ల మండల కేంద్రంలో ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు కిలోమీటరు మేర ఉన్న జాతీయ జెండాను రాచర్ల బస్టాండ్‌మీద నుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుగనున్న సందర్భంగా కార్యక్రమాలను చేపట్టారు. మాజీసైనికులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T06:16:19+05:30 IST