బోగస్‌ ఓట్లతోనే వైసీపీ గెలుపు

ABN , First Publish Date - 2022-08-19T05:52:53+05:30 IST

గత ఎన్నికల్లో బోగస్‌ ఓట్లతోనే వైసీపీ గెలుపొందిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు.

బోగస్‌ ఓట్లతోనే వైసీపీ గెలుపు
సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న తెనాలి శ్రావణ్‌కుమార్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌

గుంటూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో బోగస్‌ ఓట్లతోనే వైసీపీ గెలుపొందిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆధ్యక్షతన గురువారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ 20 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిందని, ఓటర్ల జాబితాలో అదే 20 లక్షల ఓట్లు బోగసువని తేలిందని ఆయన చెప్పారు. ఆ 20 లక్షల ఓట్లతోనే వైసీపీ అధికారంలోకి రాగలిగిందన్నారు. అందుకే ప్రతి టీడీపీ కార్యకర్త ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోల్‌ మేనేజ్‌ మెంట్‌తో ఓటర్ల జాబితాను పరీక్షించాలన్నారు. బోగస్‌ ఓట్లను తొలగించకపోతే మళ్లీ నష్టపోవాల్సి వస్తుం దని ఆయన హెచ్చరించారు. పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర(నాని) మాట్లాడుతూ ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభు త్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ముఖ ఆధారిత హాజరుతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. విలీనం పేరుతో పిల్లల జీవితా లతో ఆటలాడిన జగన్‌ ఇప్పుడు ఉపాధ్యాయులపై వేధింపులకు దిగార న్నారు. నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరే కంగా నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీపై ఐక్యంగా పోరాడాలన్నారు. సమావేశంలో తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో రాజామాస్టర్‌, ఇమ్మానియేల్‌, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టాబత్తిన శ్రీని వాసరావు, మానుకొండ శివప్రసాద్‌, ముత్తినేని రాజేశ్‌, వడ్రాణం హరిబాబు, అడకా శ్రీనివాసరావు, హనుమంతరావు, తదితరులు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T05:52:53+05:30 IST