వెంకాయమ్మకు రక్షణ కల్పించండి: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-05-18T03:47:02+05:30 IST

ప్రభుత్వంపై అసమ్మతి తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు వైసీపీ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలంటూ..

వెంకాయమ్మకు రక్షణ కల్పించండి: అచ్చెన్నాయుడు

గుంటూరు: ప్రభుత్వంపై అసమ్మతి తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు వైసీపీ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.  వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-18T03:47:02+05:30 IST