అంబేద్కర్‌ను అవమానించిన జగన్‌

ABN , First Publish Date - 2022-08-18T05:58:27+05:30 IST

‘అంబేద్కర్‌ విదేశీ విద్య’ పథకం పేరును ‘జగనన్న విదేశీ విద్య’గా మార్చి సీఎం జగన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించాడని, దళితుల ఆత్మబంధువైన అంబేద్కర్‌ పేరు స్థానంలో తన పేరును ఎలా పెట్టుకుంటాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

అంబేద్కర్‌ను అవమానించిన జగన్‌
టీడీపి దీక్షా శిబిరం వద్ద ప్రసంగిస్తున్న టీడీపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామ

రాజ్యాంగ నిర్మాతకు.. ఆర్థిక నేరస్తుడు పోటీనా ?

వైసీపీ దళిత నేతలు నోరుమెదకపపోవటం సిగ్గుచేటు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

దళితుల దీక్షలు మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌తో కలసి మద్దతు

మంగళగిరి, ఆగస్టు 17: ‘అంబేద్కర్‌ విదేశీ విద్య’ పథకం పేరును ‘జగనన్న విదేశీ విద్య’గా మార్చి సీఎం జగన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించాడని, దళితుల ఆత్మబంధువైన అంబేద్కర్‌ పేరు స్థానంలో తన పేరును ఎలా పెట్టుకుంటాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. అంబేద్కర్‌ విదేశీ విద్య పేరును తొలగించి జగన్‌ పేరు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ స్థానిక అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ నేతలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌తో వర్ల రామయ్య సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ  జగన్‌ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్ల కాలంలో దళితులకు ఏం చేశాడో తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు.అంబేద్కర్‌ విదేశీ విద్య పేరును మార్చి జగన్‌ తన పేరు పెట్టుకోవడం చాలా అసమంజసంగా వుందన్నారు. ఇదొకరకంగా దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. యావత్‌ ప్రపంచమే మెచ్చిన రాజ్యాంగ నిర్మాతకు, జైలుకు వెళ్లి వచ్చిన ఆర్థిక నేరస్తుడు ఏరకంగా పోటీ అవుతారని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్‌ను ఇంతలా అవమానించినప్పటికీ .వైసీపీలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కనీసం చీమ కుట్టనట్టయినా లేకపోవడం చాలా విచారకరమన్నారు. దళిత విద్యార్థుల విదేశీ విద్య పథకానికి తిరిగి అంబేద్కర్‌ పేరు పెట్టేంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే వుంటుందని రామయ్య స్పష్టం చేశారు.  మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ స్వాత్రంత్యానంతరం దేశ చరిత్రలో ఏరాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ కార్పోరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ఏపీలో జగన్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మూడేళ్ల తమ పాలనలో రాష్ట్రంలో ఒక్క దళిత విద్యార్థికైనా విదేశీ విద్య పథకం ద్వారా లబ్ది చేకూర్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అణచివేత చర్యలు నానాటికి పెరుగుతున్నాయన్నారు. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా దళితులంతా సమైక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 

దీక్షా శిబిరంలో మొత్తం 11 మంది పాల్గొనగా టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు తమ సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో టీడీపి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వేమూరి మైనర్‌బాబు, నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు కనికళ్ల చిరంజీవి, నియోజకవర్గ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు ఎర్రగుంట్ల భాగ్యారావు, రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి కంభంపాటి శిరీష, పార్లమెంటు నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి పినపాటి జీవన్‌కుమార్‌, నియోజకవర్గ టీడీపి నాయకులు వల్లభనేని వెంకటరావు, దారా దాసు, చింతగుంట్ల శివుడు, షేక్‌ చాంద్‌భాషా,  కొప్పుల మధుబాబు, పడవల మహేష్‌, అమరావతి దళిత జేఏసి నాయకులు బేతపూడి సుధాకర్‌, మేకల అనిల్‌కుమార్‌, తెనాలి మాణిక్యం, నెమలికంటి అనూష, కంభం సాయిచంద్‌, గుద్దంటి నాగేశ్వరరావు, దర్శి హరికృష్ణ, మాగంటి రమేష్‌, మాగంటి కల్యాణ్‌, ఉద్దంటి ధనూజ్‌, షేక్‌ అమీర్‌, కస్తూరి అమర్‌నాధ్‌, సూరగాని కిరణ్‌, ఉద్దంటి అనిల్‌, ఇసుకపల్లి ఎలీషా, షేక్‌ ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన బీసీ నాయకుల్లో కారంపూడి అంకమ్మరావు, వాకా మాధవరావు, అన్నం నాగబాబు, చింతానగళ్ల వీరేశ్వరరావు, కాసిన కొండలరావు, కలవకొల్లు వీరరాఘవులు, ఉద్దంటి లక్ష్మయ్య, గండికోట వీరరాఘవులు, ఇమ్మంది రాజారావు, నాగులపల్లి వెంకన్న, బొండంపల్లి సురేష్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-18T05:58:27+05:30 IST