తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తాం

ABN , First Publish Date - 2020-11-27T06:06:24+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలలో టీడీపీ జెండా ఎగురవేసి తీరుతామని ఆ పార్టీ జాతీయ ఉపాఽధ్యక్షుడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న నల్లారి కిషోర్‌

సమన్వయ కమిటీ సమావేశంలో నల్లారి కిషోర్


తిరుపతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ముందు లోక్‌సభ ఉప ఎన్నిక జరిగినా లేదా కార్పపరేషన్‌ ఎన్నికలు నిర్వహించినా టీడీపీ జెండా ఎగురవేసి తీరుతామని ఆ పార్టీ జాతీయ ఉపాఽధ్యక్షుడు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌ ఇన్‌చార్జి నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి సుగుణమ్మ అధ్యక్షతన గురువారం జరిగిన లోక్‌సభ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉండేందుకు తిరుపతిలోనే ఎక్కువ సమయం ఉంటామన్నారు. అందరం కలిసి పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు. దివంగత బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి టికెట్‌ ఇవ్వకుండా వైసీపీ తన వైఖరిని బయట పెట్టిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగలరాయుడు అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకు ప్రొటోకాల్‌ ఇవ్వకుండా అవమానపరిచారని గుర్తుచేశారు. దీనిపై మీడియా ముందే ఆయన అసహనం వ్యక్తంచేసినందుకు కక్షతో వారి కుటుంబానికి టికెట్‌ ఇవ్వకుండా ఆయన పాదసేవ చేసినవ్యక్తిని పోటీకి దించుతున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వైసీపీకి బుద్దిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తిరుపతి లోక్‌సభ కమిటీఅధ్యక్షుడు నరసింహ యాదవ్‌ అన్నారు. వైసీపీ అరాచకపాలకకు ప్రజలు విసిగిపోయారని సుగుణమ్మ అన్నారు. అంతకుముందు కిషోర్‌కుమార్‌ రెడ్డి, చెంగల్రాయుడులను స్థానిక నాయకులు సత్కరించారు. ఈ సమావేశంలో నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, చల్లా బాబు, డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, సూరా సుధాకర్‌ రెడ్డి, ఇనుగొండ సుబ్రమణ్యం, బీఎల్‌ సంజయ్‌, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్‌వర్మ, విజయలక్ష్మి, బుల్లెట్‌ రమణ, బ్యాంకు శాంతమ్మ, పుష్పావతి, దంపూరి భాస్కర్‌, కృష్ణ యాదవ్‌, సింధూజ, మునిశేఖర్‌ రాయల్‌, మక్కీ యాదవ్‌, ఆనంద్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T06:06:24+05:30 IST