పశ్చిమ గోదావరి జిల్లాలో ఎగురుతున్న TDP జెండా..!

ABN , First Publish Date - 2021-11-18T17:47:22+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జెండా ఎగురుతోంది..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎగురుతున్న TDP జెండా..!

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జెండా ఎగురుతోంది..! ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ తాజాగా.. పోలవరం మండలం కొరుటూరు ఎంపీటీసీ స్థానంలో గెలుపొందింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ తరఫున పోటీచేసిన అరగంటి పెంటమ్మ 429 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. పెదవేగి మండలం రామశింగవరం ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ గెలిచి నిలిచింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి 27 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే.. వైసీపీ అభ్యర్థి రీ కౌంటింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రస్తుతం రీ కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ కౌంటింగ్‌లో ఏం తేలుతుందో మరి.


మరోవైపు.. ఇరగవరం మండలం కె. కుముదవల్లి ఎంపీటీసీ స్థానంలో జనసేన గెలిచింది. వైసీపీ అభ్యర్థిపై జనసేన తరఫున పోటీచేసిన పిండి గోవిందరావు 482 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మండలం కడియపులంక- 03వ ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. కానబోయిన రాఘవ 517 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనసేన అభ్యర్థికి 1161 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం 644 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాజా ఫలితంతో కడియం మండలంలో మరోసారి పట్టు నిరూపించుకున్నది. కాగా.. ఈ స్థానం నుంచి జనసేన-టీడీపీ పొత్తు కుదుర్చుకుని పోటీ చేశాయి.

Updated Date - 2021-11-18T17:47:22+05:30 IST