ఐ.పోలవరం, మార్చి 27: పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. మురమళ్ల, భైరవపాలెం గ్రామాల్లో టీడీపీ మండలశాఖ అధ్యక్షులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆత్మగౌరవసభల్లో ఆయన మాట్లాడారు. జగన్రెడ్డి పాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, నాయకులు గుత్తుల సాయి, పేరాబత్తుల రాజశేఖర్, వీధి వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల గ్రామకమిటీ అధ్యక్షులు సాగి శ్రీనివాసరాజు, మల్లాడి రాముడు, చెయ్యేటి శ్రీనుబాబు, గంజా సుధాకర్, జంపన బాబు, దాట్ల పృధ్వీరాజు, సాగిరాజు సూరిబాబురాజు, ఉందుర్తి సుభద్ర, రాయపురెడ్డి మాణిక్యాలరావు, రేకాడి మురళీకృష్ణ, పెసంగి రాజు, పెసంగి ధర్మారావు, మల్లాడి తాతారావు తదితరులు పాల్గొన్నారు.