చరిత్ర క్షమించదు.. ఉదయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేయండి: వంగలపూడి అనిత

ABN , First Publish Date - 2022-05-22T03:11:11+05:30 IST

జగన్‌రెడ్డి పాలనంతా నిందితులకు రక్ష -బాధితులపై కక్ష అన్నట్టు ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేస్తే... ఆయన కుటుంబ సభ్యుల్ని..

చరిత్ర క్షమించదు.. ఉదయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేయండి: వంగలపూడి అనిత

అమరావతి: జగన్‌రెడ్డి పాలనంతా నిందితులకు రక్ష -బాధితులపై కక్ష అన్నట్టు ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేస్తే... ఆయన కుటుంబ సభ్యుల్ని వైసీపీ  ప్రభుత్వం మానసికంగా హత్య చేస్తోందన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఏం సందేశమిస్తున్నారని అనిత ప్రశ్నించారు. పోలీసులు మార్చురీ దగ్గర సుబ్రహ్మణ్యం భార్యను కొట్టడం దారుణమన్నారు. ‘‘తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే వైసీపీ ఎమ్మెల్సీని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు గురైన దళిత యువకుడి కుటుంబానికి అన్యాయం చేస్తే  చరిత్ర క్షమించదు. వెంటనే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ను అరెస్టు చేయాలి.’’ అని వంగలపూడి అని డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-05-22T03:11:11+05:30 IST