
అమరావతి: ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల అభ్యున్నతికి పనిచేయాలని మాజీమంత్రి జవహర్ అన్నారు. ఒక రాజకీయపార్టీకి కొమ్ము కాయడం మానాలన్నారు. హైకోర్టు ఆదేశాలను తూచా తప్పక పాటించాలని చెప్పారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తామనడం సరికాదని పేర్కొన్నారు. కరోనా కాలంలో ఉద్యోగులను పట్టించుకోక..ఇప్పుడు అధికార పార్టీకి వత్తాసు పలకడం సరికాదన్నారు.