
అమరావతి: టీడీపీ జూమ్ మీటింగ్ (Zoom Meeting)లో వైసీపీ (YCP) వాళ్లు దొంగల్లా దూరారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు భరోసా ఇస్తుంటే వైసీపీ నేతలు వెకిలి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ఏ2 సమర్థిస్తాడా? అని ప్రశ్నించారు. ఏ2 విజయసాయిరెడ్డికి ఎవ్వరూ భయపడరన్నారు. నేరస్తులకు నేరాలోచనలే వస్తాయని, వ్యవస్థలను నాశనం చేసి రౌడీయిజం చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సాగును నాశనం చేశారు కాబట్టే రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని తప్పుబట్టారు. సీఎం జగన్‌ది ఐరన్ లెగ్ అని విమర్శించారు. జగన్ ఓ దరిద్రం.. ఏపీకి పట్టిన అరిష్టం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి