విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ పెళ్లి జరుగుతోంటే.. ఈ టీ స్టాల్ నెట్టింట వైరల్ అవుతోందేంటి..?

Published: Fri, 10 Dec 2021 19:10:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ పెళ్లి జరుగుతోంటే.. ఈ టీ స్టాల్ నెట్టింట వైరల్ అవుతోందేంటి..?

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు నటుడు విక్కీ కౌశల్‌కు పెళ్లి జరిగిందంట.. సినీ సర్కిల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. అలాగే కత్రినా వయస్సు తదితర విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ప్రస్తుతం కత్రినా కైఫ్ పెళ్లికి, ఓ టీ స్టాల్‌కు లింకు పెడుతూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో కైఫ్ పెళ్లికి, ఈ టీ స్టాల్‌కు సంబంధం ఏంటని పలువురు ఆరాతీస్తున్నారు. తీరా విషయం తెలుసుకుని గతాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. 

విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ పెళ్లి జరుగుతోంటే.. ఈ టీ స్టాల్ నెట్టింట వైరల్ అవుతోందేంటి..?

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహం గురువారం రాజస్థాన్‌లో జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలతో పాటూ ఓ టీ స్టాల్ ఫొటో కూడా వైరల్ అవుతోంది. పాట్నాలోని వీర్ కున్వర్ సింగ్ చౌక్‌లో సుధీర్ అనే వ్యక్తి చాయ్ దుకాణం నడుపుతున్నాడు. ఇతడికి సల్మాన్, కత్రినా కైఫ్ జోడీ అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టుంది. అందుకేనేమో.. అతడి టీదుకాణం ముందు ఆసక్తికరమైన బోర్డు పెట్టాడు. సుధీర్ దుకాణంలో టీ తాగుదాం పదా.. అంటూ కత్రినా కైఫ్ చెవిలో సల్మాన్ చెప్పినట్లుగా రాసి పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ బోర్డు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కత్రినా పెళ్లి ఫొటోలతో పాటూ ఈ ఫొటోను కూడా జత చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ ఈ ఫొటో వైరల్ అయినా.. ప్రస్తుతం కత్రినా పెళ్లి సందర్భంగా ఇంకా వైరల్ అవుతోంది. దీంతో ఆ టీషాపు యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కత్రినా, సల్మాన్ జోడీని ఇష్టపడేవారంతా ఈ ఫొటోను షేర్ చేస్తూ.. గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. అప్పట్లో సల్మాన్, కత్నినా జోడీ చాలా పాపులర్ అనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, యువరాజ్, భరత్ వంటి చిత్రాలు వచ్చాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International