ఆర్థిక విషయాలు నేర్పండిలా!

ABN , First Publish Date - 2022-07-06T08:57:29+05:30 IST

ఆర్థిక విషయాలు నేర్పండిలా!

ఆర్థిక విషయాలు నేర్పండిలా!

ఎదిగే పిల్లలకు క్రమశిక్షణ, బయటి ప్రపంచం గురించి చెప్పటంతో పాటు పర్సనల్‌ ఫైనాన్స్‌ గురించి కూడా చెప్పాలి. మారుతున్న ప్రపంచం దృష్ట్యా టీనేజ్‌ పిల్లలకు డబ్బు పట్ల ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలో తెలియ చేయాల్సిన అవసరం పేరెంట్స్‌కు ఉంది.   

పిల్లలు కొన్ని లక్ష్యాలు సెట్‌ చేసుకునేలా చూడాలి. దానివల్ల  హార్డ్‌వర్క్‌ చేస్తారు. ఫలితంగా మంచి విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులను చూపించి ఎదిగే పిల్లలకు ఉదాహరణలు ఇవ్వాలి. దీని వల్ల ఎదిగే పిల్లలు సులువుగా అర్థం చేసుకుంటారు. 

డబ్బులు ఊరికే రావు అని చెప్పాలి. ముఖ్యంగా సేవింగ్‌ కల్చర్‌ తెలియజేయాలి. సంపాదించే వయసొచ్చాక కనీసం నెలకు పదిహేను శాతం దాచిపెట్టుకోవాలి.. అందుకే ఆదా చేయటం అలవాటు చేసుకోవాలని నిరంతరం ఎదిగే పిల్లలకు చెబుతుండాలి.

ఆదా చేయటంతో పాటు, దాన్ని పెట్టుబడి రూపాల్లోకి మళ్లించాలని చెప్పాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌, బంగారం, బాండ్స్‌, బీమా.. ఇలా ఇన్వెస్ట్‌ చేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పాలి. ఆదా చేసిన డబ్బును ఎలా ఓ బడ్జెట్‌గా క్రియేట్‌ చేసుకుని.. ఎలా ఇన్వెస్ట్‌ చేయాలో క్షుణ్ణంగా చెప్పాలి.

చిన్నవయసులోనే జీవిత బీమా, ఆరోగ్య బీమా అవసరాన్ని పిల్లలకు చెప్పాలి. ఉద్యోగం వచ్చిన వెంటనే సంపాదనను ఎలా మలచుకోవాలో ముందుగానే చెప్పాలి. టీనేజ్‌లోనే వీటిపై అవగాహన పెంచాలి.

వాళ్ల ఆలోచన దృక్పథాన్ని మార్చాలి. ఆర్థిక ఆలోచనలే కాదు.. వాళ్లంతకు వాళ్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే కాన్ఫిడెంట్‌ ఇవ్వాలి. ఆ కాన్ఫిడెంట్‌ డబ్బుతోనే వస్తుందని ప్రాక్టికల్‌గా చెప్పాలి.

ఎమర్జెన్సీ ఫండ్‌ ఖచ్చితంగా ఉండాలని తెలియజెప్పాలి. పర్సనల్‌ ఫైనాన్స్‌ విషయాలు యుక్తవయసులో చెబితే ఏం ఉపయోగం ఉంటుందని అనుకోకూడదు. ఇలాచేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆర్థిక అంశాలకు సంబంధించిన పుస్తకాల్ని, మ్యాగజైన్స్‌ను చదివేటట్లు ప్రోత్సహించాలి. 

Updated Date - 2022-07-06T08:57:29+05:30 IST