తమిళనాడులో కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-23T14:32:39+05:30 IST

విద్యార్థినులను లైంగికంగా వేధించిన ప్రభుత్వ పాఠశాల కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసిన....

తమిళనాడులో కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

 రామనాథపురం (తమిళనాడు): విద్యార్థినులను లైంగికంగా వేధించిన ప్రభుత్వ పాఠశాల కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో జరిగింది. రామనాథపురం ప్రభుత్వ పాఠశాలలో సైన్సు టీచరుగా పనిచేస్తున్న హబీబ్ విద్యార్థినుల మొబైల్ నంబర్లను కోచింగ్ సాకుతో తీసుకొని వారిని తన ఇంటికి రమ్మని బలవంతం చేశాడు. ఇంటికి వచ్చిన విద్యార్థినులను లైంగికంగా వేధించేవాడని, ఎవరైనా విద్యార్థిని ఇంటికి రాకుంటే వారి మార్కులు తగ్గిస్తానని బెదిరించేవాడని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. సైన్సు టీచర్ హబీబ్ విద్యార్థినితో మాట్లాడుతూ ఇంటికి రమ్మన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ముందు టీచర్ చాలామంది విద్యార్థినులను అలా ఇంటికి పిలిచాడని తేలింది. కీచక టీచర్ హబీబ్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. పాఠశాల విద్యార్థినులను లైంగిక వేధింపుల నుంచి నివారించడానికి తమిళనాడు సర్కాు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 

Updated Date - 2021-06-23T14:32:39+05:30 IST