ప్రతీకాత్మక చిత్రం
తల్లి, తండ్రి తర్వాత.. ఆ ప్రాధాన్యత గురువుకే ఉంటుంది. అంతటి గొప్ప స్థానానికి కొందరు కలంకం తెస్తుంటారు. టీచర్ స్థానంలో ఉంటూ విద్యార్థులను ప్రయోజకులను చేయాల్సింది పోయి.. బాలికలు, యువతుల జీవితాలను సర్వనాశనం చేస్తుంటారు కొందరు. అలాగే కొందరు మహిళా టీచర్లు కూడా ఇలాగే ప్రవర్తిస్తూ తమ వృత్తికి చెడ్డపేరు తెస్తుంటారు. ఇలాంటి వారిని చూసే.. కొందరు తల్లిదండ్రులు.. తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపాలంటేనే భయపడుతుంటారు. ఇటీవల తమిళనాడులో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ‘‘ఆమ్మా! ఆడుకుని వస్తా’’.. అంటూ ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లాడు. అయితే రాత్రవుతున్నా ఇంటికి రాలేదు. అదే రోజు ఓ మహిళా టీచర్ కూడా అదృశ్యమైంది. పోలీసుల విచారణలో చివరకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తమిళనాడు తురైయూర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఒక యువతి.. ఎంఏ, బీఈడీ, ఎంఫిల్ పూర్తి చేసింది. ఓ పాఠశాలలో ఆరేళ్లుగా టీచర్‌గా పని చేస్తోంది. ఆమెతో అదే పాఠశాలలో 11వ క్లాసు చదువుతున్న ఓ విద్యార్థి చనువుగా ఉండేవాడు. కొన్నాళ్లకు వీరి మధ్య ప్రేమ చిగురించింది. తాను టీచర్‌ను అనే విషయాన్ని మరచిన ఆమె.. తనకంటే చిన్న వయసున్న విద్యార్థిపై ప్రేమ పెంచుకుంది. ఎవరికీ తెలియకుండా అతడితో ప్రేమాయాణం సాగించేది. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సదరు విద్యార్థి పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడు. తర్వాత ‘‘ఆమ్మా! ఆడుకుని వస్తా’’.. అంటూ ఇంటి నుంచి వెళ్లాడు. అయితే రాత్రవుతున్నా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడి.. తెలిసిన వారినందరినీ విచారించారు.
అయినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు పాఠశాల టీచర్ కూడా అదృశ్యమైందని పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆమె మొబైల్ ఈఎమ్ఐ నంబర్ ఆధారంగా ట్రేస్ చేయగా.. తిరువారూర్, తంజావూరు తదితర ప్రాంతాల్లో టీచర్ సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. అక్కడి పోలీసుల సహకారంతో.. బంధువుల ఇంట్లో ఉన్న టీచర్, స్టూడెంట్‌ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. టీచర్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విద్యార్థిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి