విద్యార్థినుల నోటు పుస్తకాలలో ఉపాధ్యాయుని అసభ్య రాతలు... తల్లిదండ్రులకు తెలియడంతో...

ABN , First Publish Date - 2022-09-22T13:06:49+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలోని...

విద్యార్థినుల నోటు పుస్తకాలలో ఉపాధ్యాయుని అసభ్య రాతలు... తల్లిదండ్రులకు తెలియడంతో...

మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలోని విద్యార్థినుల నోటు పుస్తకాలలో ‘‘నన్ను కలవండి.. ఐ లవ్యూ’’ అని రాశాడు. దీనిని చూసిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఉదంతం మండీదీప్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆ పాఠశాలకు చెందిన ఒక క్రిస్టియన్ ఉపాధ్యాయుడు హిందూ బాలికల పుస్తకాలలో ‘మీట్ మీ.. ఐ లవ్యూ’’ అని రాశాడు. దీనిని ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు చూపించారు.



దీంతో కొంతమంది తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వారిని తీసుకుని పాఠశాలకు వచ్చి, సదరు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. వీరు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలు ఏడుస్తూ స్కూలు నుంచి వచ్చి, తమకు ఈ విషయం తెలిపారన్నారు. దీంతో తాము పాఠశాలకు చేరుకున్నామని, ఆ ఉపాధ్యాయుడిని బయటకు పిలవగా, స్కూలు యూజమాన్యం అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అయితే విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన నేపధ్యంలో పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని అదుపులోనికి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై తహసీల్దార్ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ ‘విద్యార్థినుల కుటుంబ సభ్యులు పోలీసులకు స్కూలులో జరిగిన ఉదంతాన్ని తెలియజేశారని, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. 

Updated Date - 2022-09-22T13:06:49+05:30 IST