బాలికను కొట్టిన ఉపాధ్యాయురాలు

ABN , First Publish Date - 2022-08-18T05:50:16+05:30 IST

బాగా చదవటం లేదంటూ ఓ విద్యార్థినిని ఆ పాఠశాల ఉపాధ్యాయు రాలు వాతలు తేలేట్టు కొట్టడంతో ఆ ఘటనపై కోపోద్రోక్తులైన విద్యార్థిని తల్లి, సమీప బంధువు ఆ ఉపాధ్యాయురాలిపై చేయిచేసుకున్న సంఘటన బుధవారం రేపల్లె పట్టణం లోని ఓమున్సిపల్‌ పాఠశాలలో చోటుచేసుకుంది.

బాలికను కొట్టిన ఉపాధ్యాయురాలు
ఉపాధ్యాయురాలు విద్యార్థిని కొట్టటంతో వీపుపై తేలిన వాతలు

ఉపాధ్యాయినిపై విద్యార్థిని తల్లి, మేనమామ దాడి 

ఉపాధ్యాయిని ఫిర్యాదు

రేపల్లె, ఆగస్టు 17: బాగా చదవటం లేదంటూ ఓ విద్యార్థినిని ఆ పాఠశాల ఉపాధ్యాయు రాలు వాతలు తేలేట్టు కొట్టడంతో ఆ ఘటనపై కోపోద్రోక్తులైన విద్యార్థిని తల్లి, సమీప బంధువు ఆ ఉపాధ్యాయురాలిపై చేయిచేసుకున్న సంఘటన బుధవారం రేపల్లె పట్టణం లోని ఓమున్సిపల్‌ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈవిషయంపై బాధిత ఉపాధ్యా యురాలు పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. సీఐ సూర్యనారాయణ కథనం మేరకు.. పట్టణంలోని 15వ వార్డులో వున్న శ్రీషిర్డీసాయి మున్సిపల్‌ ఉన్నతపాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని బేతాళ సాన్విని బాగా చదవాలంటూ ఉపాధ్యాయురాలు సుజాత మంగళవారం కొట్టింది. దీంతో విద్యార్థిని వీపుపై వాతలు తేలాయి. ఇంటికి వెళ్లిన సాన్వి వీపుపై వాతలు చూసిన తల్లిదండ్రులు కోపోద్రోక్తుల య్యారు. బుధ వారం సాన్వి తల్లి ద్వీపదాసు తమ సోదరు డైన జడ జతిన్‌ను తీసుకుని పాఠశాలకు వెళ్లింది. జడజతిన్‌ అక్కడున్న ఉపాధ్యాయు రాలు సుజాత చెంపపై కొట్టాడు. అడ్డువచ్చిన పీఈటీ కరేటి వెంకటశివకోటేశ్వరరావు, అటెండర్‌ పి.జయపాల్‌లపై చేయి చేసుకున్నాడు. ఈఘటనపై ఉపాధ్యాయు రాలు సుజాత, సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ  తెలిపారు. 


Updated Date - 2022-08-18T05:50:16+05:30 IST