ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-07-07T05:54:23+05:30 IST

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి

ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు

రంగారెడ్డి అర్బన్‌, జూలై 6 : రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్‌ డిమాండ్‌ చేశారు. విద్యా సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఉపాధ్యాయ, ఎంఈవో పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలని, మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మనఊరు, మనబడి పథకంలో అన్ని పాఠశాలలను చేర్చి అభివృద్ధి చేయాలన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలను రద్దు చేయాలని, అధిక ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి వపన్‌, నాయకులు వంశీ, వినోద్‌, అరుణ్‌, క్రాంతి, నరేష్‌, శ్రీకాంత్‌, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:54:23+05:30 IST