కీచక టీచర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-06-30T13:52:53+05:30 IST

స్థానిక మొగప్పేర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. ఈ

కీచక టీచర్‌ అరెస్టు

                       - డేటింగ్‌ పేరిట విద్యార్థినులకు లైంగిక వేధింపులు


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 29: స్థానిక మొగప్పేర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. ఈ పాఠశాలలో శ్రీధర్‌ రామస్వామి సైన్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలు మూతపడడంతో, ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థుల సెల్‌ఫోన్లు నెంబర్లు ఉపాధ్యాయులు తప్పకుండా పొందాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిని అదనుగా చేసుకొని శ్రీధర్‌ రామస్వామి ఎస్‌ఎంఎస్‌ ద్వారా విద్యార్థులకు అశ్లీల మాటలు పోస్ట్‌ చేసేవాడు. ఉపాధ్యాయుడు కావడంతో విద్యార్థులు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడ్డారు. మార్కులు ఎక్కువ వేస్తానని, నాతోటి బయటకు రావాలని విద్యార్థినులను ఆయన వేధించసాగేవాడు. ఆయన మాటలు నమ్మిన పలువురు విద్యార్థినులు అతనితో వెళ్లగా, వారిపై అతను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఉపాధ్యాయుడు వేధింపులు తట్టుకోలేని కొందరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో, దిగ్భాంతి చెందిన వారు చైల్డ్‌ లైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు, ఉపాధ్యాయులు బాలికలకు పంపిన వాట్సాప్‌ మెసేజ్‌లు, ఆడియోలు పరిశీలించిన పోలీసులు, అతడిని పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2022-06-30T13:52:53+05:30 IST