ఉపాధ్యాయ సంఘాల సమ్మె తాత్కాలికంగా వాయిదా

ABN , First Publish Date - 2022-07-08T01:49:41+05:30 IST

అమరావతి: ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. జీఓ 117ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉపాధ్యాయ

ఉపాధ్యాయ సంఘాల సమ్మె తాత్కాలికంగా వాయిదా

అమరావతి: జీఓ 117కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు జూలై 8న నిర్వహించాలనుకున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులతెో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. ఆయన హామీతో ఫ్యాఫ్టో తాత్కాలికంగా ఆందోళనను విరమించింది. బదిలీలకు సంబంధించి విధివిధానాలపై కూడా బొత్స వారితో చర్చించారు. మంత్రి హామీ మేరకు  సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఫ్యాప్టో పేర్కొంది.  జీఓలో సవరణలు చేయకపోతే భవిష్యత్‌లో పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.


జీఓ 117 అమలైతే ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య  తగ్గిపోతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిలో అంతకు మునుపు 1 : 20 ఉన్నదాన్ని 1: 30 గా మార్చడం వలన భారీ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు తగ్గిపోయి, ఉన్నవారిపై పని భారం పడతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-07-08T01:49:41+05:30 IST