ఈ యాప్‌లు మాకొద్దు

ABN , First Publish Date - 2022-08-18T06:03:26+05:30 IST

ఉపాధ్యాయుల ఫోన్‌లో ముఖ గుర్తింపు యాప్‌ ద్వారా హాజరు వేయడాన్ని మండలంలోని కె.పెంటపాడు జడ్పీ పాఠశాల ఉపాద్యాయులు వ్యతిరేకించారు.

ఈ యాప్‌లు మాకొద్దు
కె.పెంటపాడు పాఠశాల వద్ద ఉపాధ్యాయుల నిరసన

ఫోన్‌లో హాజరు వేయబోమంటున్న ఉపాధ్యాయులు


పెంటపాడు, ఆగస్టు 17: ఉపాధ్యాయుల ఫోన్‌లో ముఖ గుర్తింపు యాప్‌ ద్వారా హాజరు వేయడాన్ని మండలంలోని కె.పెంటపాడు జడ్పీ పాఠశాల ఉపాద్యాయులు వ్యతిరేకించారు. పాఠశాల వద్ద బుధవారం నిరసన తెలిపారు. ప్రభుత్వం డివైస్‌ అందజేస్తేనే హాజరు వేయగలమన్నారు. పాఠశాల హెచ్‌ఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో కొన్ని పాఠశాలలో కనీసం యాప్‌ అప్‌లోడ్‌ కాకాపోవడంతో ఉపాద్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసన తెలిపిన వారిలో ఉపాద్యాయులు కొల్లూరి మురళికృష్ణ, సత్తి శ్రీనివాసరెడ్డి, వారణాసి రాధాకృష్ణ , ఎస్‌.ఉమశ్రీ, సీహెచ్‌.శర్వాణీ , ఆంజనేయులు తదితరులు ఉన్నారు.


యాప్‌ ద్వారా హాజరు వేసే ప్రసక్తే లేదు..

కాళ్ళ: ఉపాధ్యాయులు యాప్‌ ద్వారా హాజరు వేసే ప్రసక్తే లేదని యూటీ ఎఫ్‌ కాళ్ళ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రామకృష్ణంరాజు, బీఎం ఆర్‌కె.స్వామి స్పష్టం చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు బుధవారం మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయకుండా నిరసన వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వ అనా లోచిత నిర్ణయం వల్ల బోధనా సమయం వృధా అవుతోందన్నారు. పేద, మధ్యతరగతి పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఫ్యాప్టో నా యకత్వం తెలియజేసిందన్నారు. యాప్‌ను ఉపాధ్యాయులు సొంత ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా వ్యక్తిగత సమచారం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ ప్రతీ పాఠశాలకు బయోమెట్రిక్‌ డివైస్‌ అందజేసి నెట్‌ సౌకర్యం కల్పించినప్పుడు మాత్రమే హాజరు వేయగలమని వారు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల మాదిరి పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల హాజరు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.


యాప్‌ను బహిష్కరించిన ఉపాధ్యాయులు

ఉండి: ఆన్‌లైన్‌ హాజరును మండలంలో ఉపాధ్యాయులంతా బహిష్కరిం చారు. మండలంలో సుమారు 150మంది ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయు లు, మరో 100 మంది ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం ఉదయం ఆయా సంఘాలు సూచనలు మేరకు ముఖ ఆధారిత గుర్తింపు నమోదును బహిష్కరించినట్లు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి.


ఉపాధ్యాయులపై అంత ఒత్తిడి తగదు

విద్యార్థులకు పాఠాలు బోధించనివ్వకుండా ఉపా ధ్యాయులను టార్గెట్‌ చేస్తూ అనవసరమైన ఒత్తిడికి గురిచేయడం దారుణం. పాఠశాలలో ఇప్పటికే అనేక యాప్‌లతో సతమతమవుతున్నాం. అటువంటి తరుణంలో సొంత ఫోన్లలో ముఖ హాజరు వేయమనడం సమంజసం కాదు. ఈ విధానం రద్దుచేసేవరకు పోరాడతాం.

పి.విజయరామరాజు, యూటీఎఫ్‌ జిల్లా నాయకులు, పాలకోడేరు

Updated Date - 2022-08-18T06:03:26+05:30 IST