పాత జీతాలే ఇవ్వండి

ABN , First Publish Date - 2022-01-29T06:02:52+05:30 IST

ఉపాధ్యాయులకు జనవరి నెలకు పాత వేతనాలనే అందించాలని కొవ్వూరు జోన్‌ పీఆర్సీ సాధన సమితి అధ్యక్షుడు దున్నా ప్రకాశరావు డిమాండ్‌ చేశారు.

పాత జీతాలే ఇవ్వండి
పాత జీతాలు చెల్లించాలని ఎంఈవోకు వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు

కొవ్వూరు, జనవరి 28: ఉపాధ్యాయులకు జనవరి నెలకు పాత వేతనాలనే అందించాలని కొవ్వూరు జోన్‌ పీఆర్సీ సాధన సమితి అధ్యక్షుడు దున్నా ప్రకాశరావు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఎంఈవో జె.కెంపురత్నంకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దున్నా ప్రకాశరావు మాట్లాడుతూ ఉద్యోగులకు నూతన వేతన సవరణ స్థిరీకరణ చేయడానికి ఐచ్ఛికాల సమర్పణకు 31 మార్చి 2022 వరకు సమయం ఉన్నందున జనవరి నెలకు వేతన సవరణ 2015 వేతనాలు ఇవ్వాలని కోరారు. 2015 వేతన సవరణ ప్రకారం ఉపాధ్యాయుల జీతపు బిల్లులు చేయుటకు డీడీవో రిక్వస్ట్‌ సైట్‌ పునః ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జి. కృష్ణ, సురేష్‌ తదితరులు ఉన్నారు.


పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి


చింతలపూడి: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యా యులకు మద్దతుగా ఫిబ్రవరి 7 నుంచి జరిగే సమ్మెలో పాల్గొంటున్నట్టు నగర పంచాయతీ పరిధిలోని పారిశుధ్య కార్మికులు శుక్రవారం సమ్మె నోటీసు అందజేశారు. ఏఐటీయూసీ అనుబంధంగా ఉన్న మునిసిపల్‌ వర్కర్స్‌ యూ నియన్‌ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కోస్‌లో చేర్చని కార్మికుల జీతాలను విడుదల చేయాలని, వారిని ఆప్కోస్‌లో చేర్చా లని డిమాండ్‌ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తూ 60 ఏళ్లు నిండిన వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఆప్కోస్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నగర పంచాయతీ జనాభాకు అనుగుణంగా కార్మికులను పెంచి పనిభారం తగ్గించాలని, తదితర ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్టు కార్మిక నాయకురాలు వి.అనురాధ, తదితరులు పేర్కొన్నారు.


పీఆర్సీ సాధన సమితి, వీఆర్వోల నిరసన


కామవరపుకోట: రివర్స్‌ పీఆర్సీని రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కామవర పుకోటలో పీఆర్సీ సాధన సమితి నాయకులు, వీఆర్వోలు నిరసన కార్యక్రమా లు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. పాలకులు గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని గుర్తు చేశారు. పీఆర్సీ సాధన సమితి మండల కన్వీనర్‌ జి.డి.వి.శ్రీనివాసరావు, సమితి సభ్యులు ఎం.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మళ్ళ రాజు, కె.గిరిబాబు, ఎం.శివప్రసాద్‌ పాల్గొన్నారు.


కుక్కునూరు: పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు శుక్రవారం ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. జనవరి జీతాలు పాత పద్ధతిలోనే చెల్లించాలని కోరారు. తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో సుబ్బరాయన్‌ తదితరులకు వినతిప త్రాలను అందజేశారు. కార్యక్రమంలో పీఆర్‌సీ సాధన సమితి సభ్యులు దేవరాజ్‌, బాలకృష్ణ, నాగేశ్వరరావు, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.


గోపాలపురం: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద రెండో రోజు రిలే నిరాహార దీక్షలో గోపాలపురం నుంచి ఏడుగురు ఉపాధ్యా యులు హాజరైనట్లు ఏపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు సనపల రాజశేఖర్‌ తెలి పారు. ఆందోళన కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలన్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమానికి అధిక సంఖ్య లో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-29T06:02:52+05:30 IST