‘జీతాలకు కోత పెట్టే పీఆర్సీ మాకొద్దు’

ABN , First Publish Date - 2022-01-19T06:09:47+05:30 IST

జీతాలకు కోత పెట్టే పీఆర్సీ మాకొద్దని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రీజనల్‌ కార్యదర్శి టీపీఆర్‌.దొర అన్నారు. ఏలూరు ఆర్టీసీ డిపో వద్ద మంగళవారం ఉద్యోగులు ధర్నా నిర్వ హించారు.

‘జీతాలకు కోత పెట్టే పీఆర్సీ మాకొద్దు’
పెదవేగిలో పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉపాధ్యాయులు

ఏలూరు టూటౌన్‌, జనవరి 18 : జీతాలకు కోత పెట్టే పీఆర్సీ మాకొద్దని  ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రీజనల్‌ కార్యదర్శి టీపీఆర్‌.దొర అన్నారు. ఏలూరు ఆర్టీసీ డిపో వద్ద మంగళవారం ఉద్యోగులు ధర్నా నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు అందుతాయని ఆశించామ న్నా రు. కాని దానికి భిన్నంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు. రీజనల్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.బి.అనీల్‌కుమార్‌, గౌరవ అధ్యక్షుడు టీకేరావు, సురేష్‌, ఎన్‌.శ్రీనివాస్‌, వి.సూరన్న, జీవీ శాస్త్రి, ఎం.వి.రమణారావు పాల్గొన్నారు.

 పెదపాడు, జనవరి 18 : రాష్ట్ర ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీని వెంటనే పునఃసమీక్షించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పెదపాడులో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాఫ్టో) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పెదపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం జీవో కాపీలను దహనం చేశారు. 

పెదవేగి, జనవరి 18 : ఉద్యోగులను నష్టాలకు గురిచేసే నూతన పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. పెదవేగి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. తొలుత ఎంపీడీవో రాజ్‌మనోజ్‌కు వినతిపత్రం అందించారు.  ఉపాధ్యాయ సంఘం నేతలు పరసా నాగార్జున, మహమ్మద్‌ షఫీ, మేకా లక్ష్మీనారాయణ, పద్మజ, గీతాంజలి, మనోజ్‌కుమార్‌. రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T06:09:47+05:30 IST