యాప్‌.. అయ్యోమయం

ABN , First Publish Date - 2022-08-18T05:53:51+05:30 IST

ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లు ఉంది ఉపాధ్యాయుల పరిస్థితి.

యాప్‌.. అయ్యోమయం
యాప్‌ సోపాలు : అనపర్తి రామారెడ్డి జడ్పీ హైస్కూల్‌లో యాప్‌లో లాగిన్‌కు ఉపాధ్యాయుల కుస్తీ

హాజరు నమోదుకు ఉపాధ్యాయుల ఉరుకులు.. పరుగులు

రెండో రోజు పనిచేయని యాప్‌

సెల్‌ఫోన్లతో ఉపాధ్యాయుల కుస్తీ

లీవ్‌ పడుతుందని ఆందోళన

తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న టీచర్లు

అధికారులు స్పందించాలని డిమాండ్‌


బొమ్మూరు/బిక్కవోలు/రంగంపేట/ దేవరపల్లి/ అనపర్తి, ఆగస్టు 17: ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్లు ఉంది ఉపాధ్యాయుల పరిస్థితి. ఉపాధ్యా యులు హాజరు నమోదు కు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఉదయం 8.30 గంటలకే పాఠశాలకు వచ్చినప్పటికీ మధ్యా హ్నం వరకు ఎన్ని సార్లు ప్రయత్నించినా యాప్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఫేస్‌ రికగ్ని షన్‌ యాప్‌ ఓపెన్‌ కాక టీచర్లు పరుగులు పెడు తున్నారు. పాఠశా లలో ప్రవేశానికి ఖచ్చితమైన సమయం నిర్ధేశించ డంతో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. నిమిషం ఆలస్యం కాకూడదని నియమం పెట్టడం దారుణమని పలువురు  ఉపా ధ్యాయులు వాపో తున్నారు. రెండో రోజు బుధవారం పాఠశాలల్లో ఉదయం 9 గంటల్లోపు లాగిన్‌ కోసం ఉపాఽధ్యా యులు సెల్‌ఫోన్లు పట్టుకుని పాఠశాలలో అటు ఇటూ తిరుగుతూ కనిపించారు.  అయినా యాప్‌ లాగిన్‌ కాకపోవడంతో సీఎల్‌ పడుతుందని ఆందో ళన చెందుతున్నారు. తరగతి గది నుంచి మాటి మాటికి వచ్చి లాగిన్‌ చేసినా యర్రర్‌ రావడంతో ఎటూ పాలుపోక ఒత్తిడికి గురవుతు న్నారు. లాగి న్‌కు ఎక్కువ సమయం ఇవ్వా లని ఉపాధ్యా యులు  కోరుతున్నారు. తమ సొంత సెల్‌ ఫోన్‌లో పర్సనల్‌ డాటా హ్యాగ్‌ చేసే ప్రమాదం ఉందే మో నని ఆందోళన చెందుతున్నారు.  


ఎంఈవోలకు వినతులు


పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్నభోజన పథకం, మరుగుదొడ్ల ఫొటోలకు సంబంధించిన యాప్‌లను తమ సొంత ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోమని.. వీటికి సంబంధించిన డివైజ్‌లు సరఫరా చేయాలంటూ ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తు న్నారు.తమ ఫోన్లలో యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివైజ్‌లు ఏర్పాటు చేస్తే మా హాజరు, విద్యార్థుల హాజరు నమోదు చేస్తామంటున్నారు.ఈ మేరకు బిక్కవోలు, రంగంపేట, దేవరపల్లి ఎంఈవో  కార్యా లయాల వద్ద విద్యాశాఖాధికారులకు ప్యాప్టో నేతలు బుధవారం వినతిపత్రాలు సమర్పించారు.    సరిగా పని చేయని యాప్‌లతో సమాచారం సమయానికి ఇవ్వలేదని వేలాది మంది ఉపాధ్యా యులకు షోకాజ్‌ నోటిసులివ్వడం వంటి చర్యలతో ఉపాధ్యాయులు భయబ్రాంతులకు గురవుతున్నా రని అంటున్నారు. ఉపాధ్యాయుల హాజరుకు సం బంధించి అన్ని డిపార్ట్‌మెంట్లకు ఏవిధమైన  నిబంధనలు ఉన్నాయో అదే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.యాప్‌ల డౌన్‌లోడ్‌ వల్ల విద్యా బోధనకు ఆటంకం కలుగుతుందన్నారు. పని చేయని యాప్‌లతో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారని తూర్పుగోదావరి జిల్లా యూటీ ఎఫ్‌ గౌరవాధ్యక్షుడు హుస్సే శంకరుడు అన్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ కారణంగా సమయం వృథా  అవుతుందని విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆల స్యం అవుతుందని బొమ్మూరులోని జీపీఆర్‌ ఉన్నత   పాఠశాల హెచ్‌ఎం ఈశ్వరి తెలిపారు.

Updated Date - 2022-08-18T05:53:51+05:30 IST