ఓపీవోలుగా ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2021-03-02T06:08:35+05:30 IST

భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పనిచేస్తున్న 90 శాతం మంది ఉపాధ్యాయులను జీవీఎంసీ ఎన్నికలకు అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్‌ (ఓపీవో)లుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఓపీవోలుగా ఉపాధ్యాయులు

తగరపువలస, మార్చి 1: భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పనిచేస్తున్న 90 శాతం మంది ఉపాధ్యాయులను జీవీఎంసీ ఎన్నికలకు అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్‌ (ఓపీవో)లుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారి, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు ఉంటారు. వీరికి సహాయకులుగా ఓపీవోలను నియమించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్‌ అధికారులుగా పలు మండలాల్లో బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఉపాధ్యాయులను కూడా ఓపీవోలుగా నియమించారు. ఈ ఉత్తర్వులు అందుకున్నవారు ఎన్నికలు జరిగే ఈనెల పదో తేదీ ఉదయం ఏడు గంటల్లోగా తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరిని ఏ పోలింగ్‌ కేంద్రానికి కేటాయించారో తొమ్మిదో తేదీన తెలియజేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-02T06:08:35+05:30 IST