ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన

ABN , First Publish Date - 2021-07-24T05:13:24+05:30 IST

అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పాత తాలూకా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పీఆర్సీ ప్రకటించాలని, బకాయిపడిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

ఫ్యాప్టో ఆధ్వర్యంలో  ఉపాధ్యాయుల ఆందోళన
టెక్కలి: ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

పీఆర్సీ అమలు, బకాయి డీఏల చెల్లింపులపై నినాదాలు 

(ఆంధ్రజ్యోతి బృందం)

అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పాత తాలూకా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పీఆర్సీ ప్రకటించాలని, బకాయిపడిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. తక్షణం సమస్యలు పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో వివి ధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొనగా, జనసేనతో పాటు పలు సంఘా ల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. అనంతరం  తహసీల్దార్లకు వినతిపత్రాలను అందజేశారు. 

 



Updated Date - 2021-07-24T05:13:24+05:30 IST