11వ పీఆర్సీ ఏమైంది?

ABN , First Publish Date - 2021-04-23T04:55:10+05:30 IST

అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వ ఉపాధ్యాయులు జగన్‌ సర్కారును ప్రశ్నించారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

11వ పీఆర్సీ ఏమైంది?
ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల ధర్నా

నెల్లూరు రూరల్‌, ఏప్రిల్‌ 22 : అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వ ఉపాధ్యాయులు జగన్‌ సర్కారును ప్రశ్నించారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరు రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సంఘం నేతలు ఎంసీ అచ్చయ్య, పీ బాబురెడ్డి మాట్లాడు తూ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని  జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఆ మాటే అనుకోవడం లేదని మండిపడ్డారు. పీఆర్సీకి వేసిన కమిటీపై మరో కమిటీ వేసి కాలయాప న చేస్తున్నారని విమర్శించారు. 2018 జూలై నుంచి 11వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోపు పీఆర్సీపై అనుకూల ప్రకటన రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్‌, బాబు, రమాదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T04:55:10+05:30 IST