సమస్యలపై ఉపాధ్యాయుల ధర్నా

ABN , First Publish Date - 2021-07-30T05:56:27+05:30 IST

అపరి ష్కృతంగా ఉన్న సమస్యలపై ఉపాధ్యా యులు గురువారం ఇక్కడి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

సమస్యలపై ఉపాధ్యాయుల ధర్నా
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

 పాదయాత్రలో హామీలపై వెంటనే దృష్టి సారించాలి

 సీపీఎస్‌ రద్దు, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలి

 ఏపీటీఎఫ్‌ జిల్లా  ప్రధాన కార్యదర్శి  ప్రకాశరావు  డిమాండ్‌

నర్సీపట్నం, జూలై 29 : అపరి ష్కృతంగా ఉన్న సమస్యలపై ఉపాధ్యా యులు గురువారం ఇక్కడి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.ప్రకాశరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఆరు విడతలుగా చెల్లించాల్సిన కరువు భత్యం, పీఆర్సీ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా అమలుకు నోచుకోలేదన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పడాల అప్పారావు, రాష్ట్ర కౌన్సిలర్‌ కె.సత్యనారాయణ, కె.సత్యారావు, అప్పన్నబాబు, జగన్‌లతో పాటు నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల, మాకవరపాలెం, రోలుగుంట, కొయ్యూరు మండలాల ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:56:27+05:30 IST