కొత్త డీఎస్సీకి ఎయిడెడ్‌ కోత

ABN , First Publish Date - 2021-10-25T05:22:04+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లోకి ఎయిడెడ్‌ ఉపాధ్యా యుల సర్దుబాటు... సంబంధిత టీచర్లకు లాభమో, నష్టమో గాని నిరుద్యోగ అభ్యరులు మాత్రం కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెట్టుకున్న ఆశలు గల్లంతేనని భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి.

కొత్త డీఎస్సీకి ఎయిడెడ్‌ కోత

 డీఎస్సీ వేకెన్సీల్లో ఎయిడెడ్‌ టీచర్లతో సర్దుబాటు ఫలితం

 నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు గల్లంతు

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 24 : ప్రభుత్వ పాఠశాలల్లోకి ఎయిడెడ్‌ ఉపాధ్యా యుల సర్దుబాటు... సంబంధిత టీచర్లకు లాభమో, నష్టమో గాని నిరుద్యోగ అభ్యరులు మాత్రం కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెట్టుకున్న ఆశలు గల్లంతేనని భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి. విలీనానికి అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ టీచర్లను డీఎస్సీ కోసం రిజర్వు చేసిన పోస్టులు/వేకెన్సీల్లో నియమిస్తామని ప్రకటించడంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆందోళనకు ఊతమిస్తోంది. 

డీఎస్సీ పోస్టులు 244.. ఎయిడెడ్‌ టీచర్లు 231 

జిల్లాలో 177 ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనానికి/సర్దుబాటుకు ఇప్పటికే అంగీకారం తెలియ చేశారు. మరో 44 ఎయిడెడ్‌ పాఠశాలల యాజమా న్యాలు విలీనానికి అంగీకారం తెలపనందున, ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న 92 మంది ఉపాధ్యాయులు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఇక అంగీకా రం తెలిపిన 463 మంది టీచర్లలో 207 మంది ప్రాథమిక పాఠశాలల్లోను, 25 మంది ప్రాఽథమికోన్నత పాఠశాలల్లోను ఎస్జీటీ కేడర్‌లో పనిచేస్తుండగా మిగతా 231 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో హైస్కూళ్లల్లో పనిచేస్తున్నారు. కాగా జిల్లా విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన మొత్తం 875 వెకెన్సీల జాబితాలో ఇన్‌ సర్వీస్‌ ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా 631 వెకెన్సీలను భర్తీ చేయనున్నారు. ఇవికాక స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో 2018 నవంబర్‌ 1వ తేదీ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ వరకు మొత్తం 244 వెకెన్సీలు మాత్రమే డీఎస్సీ కోసం గవర్నమెంట్‌/జడ్పీ, ఏజెన్సీ యాజమాన్య పాఠశాలల్లో ఉన్నట్టు స్పష్టం చేసింది. ఆ ప్రకారం ఎయిడెడ్‌ టీచర్లను ప్రభుత్వ పాఠశాలల్లోని డీఎస్సీ వెకెన్సీల్లో సర్దుబాటు చేయడానికి మునిసిపల్‌/గవర్నమెంట్‌/జడ్పీ/ ఏజెన్సీ యాజమాన్యాలను ఎంచుకునేందుకు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కొత్త డీఎస్సీ రిక్రూట్‌మెం ట్‌లో జిల్లాకు సంబంధించి ఎస్జీటీ కేడర్‌లో రేషనలైజేషన్‌ చేసిన తరువాత గరిష్టంగా 200 మించి పోస్టులు/వెకెన్సీలు ఉండకపోవచ్చునని సమాచారం. ఆ ప్రకారం జిల్లాలో ఎయిడెడ్‌ టీచర్ల సర్దుబాటుతో కొత్తగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు పోస్టులు పెద్దగా అవసరం ఉండకపోవచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల స్థానే పూర్వ ప్రాఽథమిక విద్య (పీపీ–1, 2), ఒకటి, రెండవ తరగతిలతో ఏర్పాటవుతున్న ఫౌండేషన్‌ స్కూల్స్‌కు కొత్తగా టీచర్‌ పోస్టులను మంజూరు చేస్తే తప్ప డీఎస్సీ నియామకాలు పెద్ద సంఖ్యలో ఉండకపోవచ్చని చెబుతున్నారు. మరోవైపు డీఎస్సీ వెకెన్సీలకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా సర్దుబాటు చేయడానికి ఎయిడెడ్‌ టీచర్లు బోధిస్తున్న సబ్జెట్‌ విషయంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.


Updated Date - 2021-10-25T05:22:04+05:30 IST