ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-29T06:39:33+05:30 IST

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎప్‌ జిల్లా అధ్యక్షుడు సిరికొండ అనిల్‌కుమార్‌ అన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
నేరేడుచర్లలో తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జూన్‌ 27: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎప్‌ జిల్లా అధ్యక్షుడు సిరికొండ అనిల్‌కుమార్‌ అన్నారు.  నేరేడుచర్లలో నిర్వహించిన ధర్నాలో అనిల్‌కుమార్‌ మాట్లా డారు. పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరా టాలు చేస్తామన్నారు.  కార్యక్రమంలో సైదులునాయక్‌, అక్కయ్యబాబు, నర్సింహారావు పాల్గొన్నారు.

- గరిడేపల్లిలో యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు ఎలక సైదిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్‌ కృష్ణయ్య, కొణతం వెంకటరెడ్డిపాల్గొన్నారు.

- విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ అనంతగిరి మండల అధ్యక్షుడు మండవ ఉపేందర్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేశారు. అనంతరం తాహసీల్దార్‌ సంతోష్‌కిరణ్‌కు విన తిపత్రం అందజేశారు. కార్య క్రమంలో ఆంజనేయులు, బావ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

- తిరుమలగిరి మండల కేంద్రంలో యూటీఎఫ్‌  జిల్లా కార్య దర్శి సోమన్న ఆధ్వర్యంలో తహసీ ల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌  రమణారెడ్డికి వినతిపత్రం అందజే శారు. కార్యక్రమంలో  చల్లగుండ్ల సోమయ్య,  దామెర ఎల్లయ్య  పాల్గొన్నారు.

- పాఠశాలల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని యూటీఎఫ్‌  జిల్లా కార్యదర్శి ఆర్‌.దామోదర్‌ అన్నారు.  మఠంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం  తహసీల్దార్‌ సాయిగౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. 

- మునగాల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో  జిల్లా ఉపాధ్యక్షుడు  శ్రీనివాసరెడ్డి, తెలంగాణ పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ధనమూర్తి, గోవర్ధన్‌, లక్ష్మీనారాయణ,  లక్ష్మి పాల్గొన్నారు.




Updated Date - 2022-06-29T06:39:33+05:30 IST