టీచర్ల పదోన్నతుల్లో అవకతవకలు ?

ABN , First Publish Date - 2020-11-30T03:48:02+05:30 IST

సమాజానికే ఆదర్శ వంతులం అని చెప్పుకునే ఉపాధ్యాయులు తమ వరకు వచ్చే సరికి మా త్రం అన్ని మరిచి పదోన్నతుల పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నా రు.

టీచర్ల పదోన్నతుల్లో అవకతవకలు ?
డీఈవో కార్యలయం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం 

2013 -14 ఏడాదిలో నెలనెల పదోన్నతుల్లో  తప్పులు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 29 : సమాజానికే ఆదర్శ వంతులం అని చెప్పుకునే ఉపాధ్యాయులు తమ వరకు వచ్చే సరికి మా త్రం అన్ని మరిచి పదోన్నతుల పొందేందుకు అడ్డదారులు తొక్కుతున్నా రు. ఉద్యోగాలు పొందేందుకు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి టీచరు ఉ ద్యోగాలుపొందిన వారు కొందరైతే, పదోన్నతి పొందేందుకు డిగ్రీలు, పీజీల సర్టిపికెట్లు నకిలీవి సృష్టించి పదోన్నతి పొందింది మరికొందరు. మరికొం దరు టీచర్లు మాత్రం అలాంటివి ఏమీ లేకుండా ఏకంగా డీఈవోలనే మేనేజ్‌ చెసి అర్హత లేకున్నా 2013 - 2014లో జరిగిన నెల నెల పదోన్న తుల్లో పదోన్నతులు పొంది దర్జాగా పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపా ధ్యాయులుగా పనిచేస్తూ అదనంగా వేతనం పొందుతున్నారు. జిల్లా విద్యా శాఖ మాత్రం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తోందని అర్హత ఉన్న పదోన్నతు లు రాని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి 2013 - 2014 సంవత్సరంలో జరిగిన నెల నెల పదోన్నతులపై విచారణ జరిపిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 23మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమా చారం.  ఇందులో అత్యధికంగా నారాయణ పేట జిల్లాలోనే 10 మంది టీచర్లు ఉన్నట్లు తెలిసింది. ఇందులో నలుగురు ఆంగ్ల ఉపాధ్యాయలు ఉన్నట్లు సమాచారం.


ఆలస్యంగా వెలుగులోకి...


2013 - 2014 సంవత్సరాల్లో అప్పటి ప్ర భుత్వం ఉపాధ్యాయులకు సంబంధించి నెలనెల పదోన్నతులు చెపట్టేది. ఆ సమ యంలో ప్రతి నెల పదవీ విరమణ పొం దిన ఉపాధ్యాయుల స్థానంలో అదే నెలలో సీనియార్టీ టీచర్లకు పదో న్నతులు కల్పించేవారు. ఆ సమయంలో కొందరికి అనుకున్న ప్లేస్‌ దొరకక పదోన్నతులు పొందేవారు కాదు. దీంతో ఖాళీగా మిగిలిపోయేవి. అదే అదునుగా తీసుకున్న కొందరు సిబ్బంది అప్పటి డీఈవో సహకా రంతో కొందరు టీచర్లు డీఈవోకు రూ. 40వేల నుంచి రూ. 50వేల వరకు ముడుపులు తీసుకొని సుమారు 23 మందికి పదోన్నతులు కల్పించినట్లు సమాచారం. అప్పట్లో డీఈవో కార్యా లయంలో డీఈవోకు అత్యంత సన్ని హితుడిగా ఉన్న ఓ ఉపాధ్యాయుడు కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన జిల్లా కీలకమైన బాధ్యత కూడా వ్యవహరించారు. ఆయన ద్వారానే నేరుగా డీఈవోకు ముడుపులు అందినట్లు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయలుకు సంబంధించిన పదోన్నతుల్లో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఉర్డూ మీడియం ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల ఉపాధ్యాయలు పదోన్నతులు ఉర్డూ మీడియం ఉన్నవారికే కల్పించాలన్న నిబంధన ఉన్నా, దీన్ని కాదని ఇతర మీడిమం వారికి పదోన్నతులు కల్పించినట్లు వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా మరి కొందరు అర్హత లేకున్నా అడ్డదారుల్లో పదోన్నతులు పొందారు. అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయలు పదోన్నతుల్లో అవకతవకలు జరిగినట్లు తెలిసింది. ఇదంతా ఆరేళ్లుగా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు సదరు ఉపాధ్యాయలు. ఇందులో ఉండే ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య గొడవ జరగటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ నోటా ఈ నోటా పలువురికి తెలియడంతో అర్హులైన టీచర్లు  అవాక్కవుతున్నారు. 


నా దృష్టికి రాలేదు 


నెల నెల పదోన్నతులు 2014 ముందు మాత్రమే జరిగాయి అప్పడు ఎం జరిగిందో తన దృష్ఠికి రాలేదు. దీనికి సంబంధించి వివరాలు తీసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అవకతవకలు జరిగితే విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- ఉషారాణి డీఈఓ, మహబూబ్‌నగర్‌

Updated Date - 2020-11-30T03:48:02+05:30 IST