ఉపాధ్యాయుల నిరసన

ABN , First Publish Date - 2021-07-24T05:36:53+05:30 IST

ఆదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.

ఉపాధ్యాయుల నిరసన
ఉపాధ్యాయుల ఆందోళన

ఆదోని(అగ్రికల్చర్‌), జూలై 23: ఆదోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో కన్వీనర్‌ నాగరాజు, కోకన్వీనర్లు కృష్ణమూర్తి, భాస్కర్‌, నాగరాజు, ప్రధానో పాధ్యాయుల సంఘం డివిజన్‌ అధ్యక్షుడు రామ్మూర్తి మాట్లాడుతూ 2018 జూలై నుంచి అమలు కావాల్సిన 1వ వేతన సవరణ (పీఆర్‌సీ) మూడు సంవత్సరాలై నా అతీగతి లేదన్నారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని సీఎం జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిం చారు. ఆరు విడతల డీఏ పెండింగ్‌లో ఉందని అన్నారు. వివిధ పథకాల పేరుతో సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయ సంక్షేమాన్ని విడనా డడం విచారకరమన్నారు. కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు మధు, రామసుబ్బా రెడ్డి, వీరచంద్రయాదవ్‌, గాదిలింగప్ప, సునీల్‌రాజ్‌కుమార్‌, హైమావతి, నీలమ్మ, నరసయ్యగౌడ్‌, ఏపీ ఎన్జీవోస్‌ నాయకులు రమేష్‌రెడ్డి, యాసిన్‌బాషా, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు విరుపాక్షి పాల్గొన్నారు. 


ఆలూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్మోహ న్‌రెడ్డి జాప్యం చేయడం తగదని ఆలూరు నియోజకవర్గ ఫ్యాప్టో చైర్మన్‌ కాశీం అన్నారు. శుక్రవారం ఆలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీ అమలు చేయాల ని, పెండింగ్‌లో ఉన్న ఏడు డీఏలు మొత్తం విడుదల చేయాలన్నారు. అనంతరం ఎంపీడీవో అల్లాబకాశ్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకు లు నాగరాజు, మురళీ, రామకృష్ణారెడ్డి, పోతురాజు, ఖలందర్‌, వెంకటేష్‌, ఉరుకుందు, రామకృష్ణ, నాగరాజు, బసవరాజు, గిరయ్య, తిమ్మప్ప, గోవిందప్ప, శేఖర్‌ పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు: ఉద్యోగుల సంక్షేమంపై మాత్రం శీతకన్ను వేసిందని ఫ్యాప్టో నాయకులు కర్రెకృష్ణ, ఎల్లప్ప, నాగమణి, బసవరాజు, ఖాసీం, మల్లారి నాగరాజు, గోట్ల చంద్రశేఖర్‌లు అన్నారు. పీఆర్సీ, డీఏల మంజూరుతోపాటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం ఎమ్మిగ నూరులో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీటీకి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆంజనేయులు, దావీదు, శాంతిరాజు, ప్రసన్న కుమార్‌, సురేష్‌ వరప్రసాద్‌, ప్రభు, విజయలక్ష్మి, అనురాధ, సుజాత, రాముడు, సురేష్‌ విజయ్‌కుమార్‌, జ్ఞానప్రకాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:36:53+05:30 IST