Ts News: సమస్యల పరిష్కారం కోసం టీచర్ల ఆందోళన

ABN , First Publish Date - 2022-07-27T17:04:27+05:30 IST

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు (Teachers) ఆందోళన చేపట్టారు.

Ts News: సమస్యల పరిష్కారం కోసం టీచర్ల ఆందోళన

హైదరాబాద్ (Hyderabad): ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు (Teachers) ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు టీచర్లను అరెస్ట్ (Arrest) చేశారు. ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని టీచర్లు విమర్శించారు. కాగా అరెస్ట్ చేసిన 70 మంది టీచర్లను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (Telangana Teachets Federation) అధ్వర్యంలో డీఎస్ఈ (DSE) కార్యాలయం ముట్టడికి యత్నించారు. బదిలీలు, పదోన్నతులు, 317 జీవో బాధితుల అప్పీళ్ళను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ గ్రాంట్స్ వెంటనే కేటాయించాలని, విద్యా వాలంటీర్లను నియమించాలని ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే అరెస్టు చేస్తారా? అంటూ ఉపాధ్యాయులు మండిపడ్డారు.

Updated Date - 2022-07-27T17:04:27+05:30 IST