నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

ABN , First Publish Date - 2021-01-24T04:05:38+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర పిలుపు మేరకు జాక్టో, యూఎస్‌పీసీ నారాయణపేట సంఘాలచే శనివారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

నారాయణపేట, జనవరి 23: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర పిలుపు మేరకు జాక్టో, యూఎస్‌పీసీ నారాయణపేట సంఘాలచే శనివారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శివరాము లు, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మహమూద్‌, ఎస్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షు డు రాజేష్‌, డీటీఎఫ్‌ పరంధాములు, ఎస్‌ఎల్‌టీఏ అధ్యక్షుడు యఽశ్వంత్‌ మాట్లా డారు. పీఆర్సీ నివేదికను వెంటనే ఆన్‌లైన్‌లో పెట్టి బహిర్గతం చేయాలని, 2018 మే 16న సీఎం ఇచ్చిన హామీలకు ఉత్తర్వులు జారీ చేయాలని, సీపీఎస్‌ విధా నం రద్దు చేయాలని ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యు లకు వారు సంఘీభావం తెలిపారు. కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చేసి అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డికి వినతిపత్రం అందించారు. కా ర్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రెడ్డప్ప, రాంగో పాల్‌, బాలాజీ, భీమయ్య, వెంకట్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T04:05:38+05:30 IST