ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ అన్యాయం

ABN , First Publish Date - 2021-03-07T05:09:17+05:30 IST

క్రమశిక్షణతో పనిచేస్తున్న ఆదివాసీ ఉపాధ్యా యులను కలెక్టర్‌ సస్పెండ్‌ చేయడం అన్యాయమని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ స్పష్టం చేసింది.

ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ అన్యాయం

బుట్టాయగూడెం, మార్చి6:క్రమశిక్షణతో పనిచేస్తున్న ఆదివాసీ ఉపాధ్యా యులను కలెక్టర్‌ సస్పెండ్‌ చేయడం అన్యాయమని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ స్పష్టం చేసింది. బుట్టాయగూడెంలో శనివారం జరిగిన ముఖ్యనాయకులు సమావేశంలో పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ తక్షణమే ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ రద్దు చేయాలన్నారు. గిరిజనేతర నాయకు డి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడం తగదన్నారు. గిరిజనేతర నాయకుడు ఏ ఉద్దేశంతో ఉపాఽధ్యాయులపై ఫిర్యాదు చేశారో ఆదివాసీ సమాజానికి తెలపాలన్నారు.  ఆదివాసీ టీచర్లకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్‌ చేశారు. తెల్లం లక్ష్మణ్‌, శ్రీను, నాగార్జున, వెంకటేశ్వర్లు, సంజీవరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:09:17+05:30 IST