టీచర్లు ట్యూషన్లు నడిపితే చర్యలు

ABN , First Publish Date - 2022-03-02T14:22:25+05:30 IST

ట్యూషన్ల నిర్వహణ, ఇంటి దగ్గర ప్రైవేట్లు చెప్పే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. తంజావూరుకు చెందిన తార అనే

టీచర్లు ట్యూషన్లు నడిపితే చర్యలు

              - సెలవులు అధికమైనా సంతృప్తి చెందరా?... 

              - హైకోర్టు మదురై శాఖ


పెరంబూర్‌(చెన్నై): ట్యూషన్ల నిర్వహణ, ఇంటి దగ్గర ప్రైవేట్లు చెప్పే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. తంజావూరుకు చెందిన తార అనే ఉపాధ్యాయురాలి బదిలీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ ను విచారించిన జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం.. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పనితీరు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరగడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సెలవులు అధికమని, పనివేళలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. కానీ, కొందరు ఉపాధ్యాయులు ట్యూషన్లు చెబుతున్నారని, డబ్బు సంపాదించాలనే దురాశే ఇందుకు కారణమన్నారు. ఇలాంటి చర్యలు సమాజానికి క్యాన్సర్‌ లాంటివన్నారు. అలాంటి వారితో మెరుగైన విద్య ఎలా సాధ్యమవుతుందని, ఈ కారణంగా పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాఠశాలల నిర్వహణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. అలాగే, రాజకీయనేతలు, అధికారులకు అండగా ఉపాధ్యాయులు పని చేయడం ఆందోళన కలిగించే పరిణామన్నారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాంటి వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - 2022-03-02T14:22:25+05:30 IST