AP News: ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల నిరసన

ABN , First Publish Date - 2022-08-16T19:31:39+05:30 IST

ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్, ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు నిరసనకు దిగాయి.

AP News: ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల నిరసన

అమరావతి: ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఫేస్ క్యాప్చరింగ్ అటెండెన్స్ (Face Capturing Attendance) విధానం రద్దు చేయాలని  డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ (APTF), ఫ్యాప్టో (Fapto) ఉపాధ్యాయ సంఘాలు నిరసనకు దిగాయి. ఎన్నికల హామీ సిపిఎస్(CPS) రద్దు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల విలీన ప్రక్రియ ఉపసంహరించాలని నిరసన చేపట్టారు. జీవో 117 రద్దు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ డిమాండ్‌లతో ఉపాధ్యాయ సంఘాలు 100 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. నేటి నుంచి వచ్చే నెల 16 వరకు వరకు 30 రోజుల పాటు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరన దీక్షలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. 

Updated Date - 2022-08-16T19:31:39+05:30 IST